నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 25 : టీఆర్ఎస్ సర్కార్ పేద ల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అం డగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 523 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె క్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు అన్యాయం చేశాయని గుర్తించి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజా సంక్షే మం కోసం పాటుపడుతున్నారన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన పథకం అందుతున్నదన్నారు. మె డికల్ కళాశాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి మెడికల్ వి ద్య చదివే బాధ తీరుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య చదువుకోవచ్చన్నారు.
మం జూరైన ఆరు నెలల్లో పూర్తి చేసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలపై కొందరు హేళనగా మాట్లాడుతున్నారని, ఇది వారికి తగదన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అలాగే సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.29 లక్షల చెక్కులను 55 మంది బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, డీసీసీబీ డైరెక్టర్ జ క్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, ఆ ర్డీవో నాగలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.