వనపర్తి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధా న్యం కొనుగోలుకు ఏర్పాట్లు జోరుగా చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లలో ము నిగితేలుతున్నారు. ప్రస్తుతం కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుకు అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యాసంగి ధాన్యం కొనబోమని కేంద్రం మొండికేసి నా.. రైతులకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. రైతులు నష్టపోకూడదనే సదుద్దేశంతో చివరిగింజ వరకు కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ధాన్యం కొనుగోలుకు సంబంధించి 32 లక్షల గన్నీ బ్యాగులు కావాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు జిల్లా నుంచి ఇం డెంట్ పెట్టారు. జిల్లాలో 69 వేల ఎకరాల్లోనే వరి సాగు చేయగా, 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వ అంచనా. వా నకాలం సీజన్లో పాటించిన టోకెన్ విధానాన్నే ఈసారి కూడా కొనసాగించనున్నారు. ఐకేపీ, మెప్మా, పీఏసీసీఎస్, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ శాఖ ద్వారా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనున్నారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగు లు, వడ్లు తూచే యంత్రాలను సమకూరుస్తున్నారు. అక్కడక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
సీఎం సాహసోపేత నిర్ణయం..
ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కొనబోమని చెప్పి రైతులకు అన్యాయం చేసినా.. రైతుబాంధవుడిగా మారి ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రకటించడం సంతోషంగా ఉన్నది. మంచి మద్దతు ధర ప్రకటించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి రైతులంతా రుణపడి ఉంటారు.
– రాజాప్రకాశ్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, పెద్దమందడి