భూత్పూర్, ఏప్రిల్ 23 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కప్పెట, కొత్తమొల్గర, పాతమొల్గర, మద్దిగట్ల, వెల్కిచర్ల, తాటిపర్తి గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశవైఖరి ప్రదర్శించగా, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చి రైతన్నకు అండగా నిలిచిందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్, సర్పంచులు వేణు, ప్రియాంకారెడ్డి, వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
రైతన్న సంక్షేమానికి పెద్దపీట
బాలానగర్, ఏప్రిల్ 23 : ప్రభుత్వం రైతన్న సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్ అన్నారు. మండలంలోని ఉడిత్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు యాసంగి ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతులు మద్దతు ధరకు ధాన్యం విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్‌యాదవ్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, ఏప్రిల్ 23 : మండలంలోని పోల్కంపల్లి, నందిపేట, దాసరిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సర్పంచులు భాస్కర్‌గౌడ్, ఏవో రాజేందర్‌రెడ్డి, ఏపీఎం విష్ణుచారి, నాయకులు గూపని కొండయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్, వెంకట్రాములు, రాజు, శేఖర్, మధుయాదవ్, నర్సింహులుగౌడ్, శ్రీనివాస్‌శర్మ, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
గండీడ్/మహ్మదాబాద్, ఏప్రిల్ 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంలు బాలకృష్ణ, అనురాధ శనివారం వేర్వేరు ప్రకటనల్లో కోరారు. గండీడ్ మండలంలోని బల్సూర్గొండ, చిన్నవార్వల్, జక్లపల్లి, కప్లాపూర్, లింగాయపల్లి, కొమ్మిరెడ్డిపల్లి, మన్సూర్‌పల్లి, పగిడాల్, రెడ్డిపల్లి, రంగారెడ్డిపల్లి, రుసుంపల్లి, సల్కర్‌పేట, వరహగిరిపల్లి, వెన్నాచేడ్, ఆశిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు మహ్మదాబాద్ మండలంలోని అన్నారెడ్డిపల్లి, చౌదర్పల్లి, గాధిర్యాల్, జూలపల్లి, మంగంపేట, సంగాయపల్లి, ముకర్లాబాద్, వెంకట్‌రెడ్డిపల్లి, కంచన్‌పల్లి గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలను పరిగి ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు.