జడ్చర్లటౌన్, ఏప్రిల్ 23 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ముస్లింలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ప్రభు త్వం దుస్తులను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాల ను అమలు చేస్తున్నట్లు వివరించారు. రంజాన్ మాసం లో రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రార్థించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇర్ఫాన్, మహ్మద్‌సాదిక్, వలీయొద్దీన్, మజహర్, అజ్జు, షబ్బీర్, ఆయా జ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాలకు ప్రాధాన్యం
భూత్పూర్, ఏప్రిల్ 23 : టీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే అన్నివర్గాలకు సమప్రాధాన్యం లభిస్తున్నద ని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. స్థానిక కేఎంఆర్ ఫంక్షన్హాల్లో ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు సంతోషంగా పండుగలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. మొత్తం 400మందికి దుస్తులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్‌నజీబ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఖాజా, అజీజ్, జాకీర్, నాయకులు నారాయణగౌడ్, స త్యనారాయణ, చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, శ్రీనివాస్‌రెడ్డి, బాలస్వామి, అహ్మద్యాసీన్, ఖాసీం ఉన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఏప్రిల్ 23 : మండలంలోని మోతీఘనపూర్‌లో మాజీ సర్పంచ్ దేశ్‌ముఖ్ ప్రతాప్‌రెడ్డి ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదిరెడ్డి, శమీమ్, వాజీద్, పాషా తదితరులు పాల్గొన్నారు.