అమరచింత, ఏప్రిల్ 23 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహా సంగ్రామ పాదయా త్ర శనివారం పదో రోజు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్ణంపల్లి నుంచి ఈర్లది న్నె, మిట్టనందిమల్ల గ్రామల మీదుగా నారాయణపేట జిల్లా నర్వ మండలం ఎల్లంపల్లికి చే రుకున్నది. అయితే పాదయాత్రకు పెద్దగా స్పం దన లభించలేదు. శుక్రవారం రాత్రి కిష్ణంపల్లి శివారులో విడిది చేసిన బండి పాదయాత్ర బృందం ముందుగా ప్రకటించిన నందిమల్ల, మస్తీపూర్, అమరచింత కాకుండా కిష్ణంపల్లి, ఈర్లదిన్నె, మిట్టనందిమల్ల మీదుగా పాదయా త్ర చేయాలని నిర్ణయించారు.
ఆ గ్రామాల్లో బీ జేపీ కార్యకర్తలు పెద్దగా లేకపోవడంతో 9 గంటలకు ప్రారంభం కావలసిన పాదయాత్ర జనం లేక ఇతర గ్రామాల నుంచి కార్యకర్తలు వచ్చిన తర్వాత వేదపండితులతో పూజలు చేసి గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పాదయాత్రకు ముందే విడిది చేసిన చోట బండి కటౌట్లు కింద పడిపోయాయి. ఈ సందర్భంగా ఈర్లదిన్నె, మిట్టనందిమల్ల గ్రామాల్లో ప్రజలతో రచ్చబండ నిర్వహించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ 300 ఉన్న సిలిండర్ 1200 చేశారని, 70 ఉన్న నూనె ధరలను 200 చేశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.