మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 23 : 2021 విద్యాసంవత్సరం శనివారం ముగియడంతో ఆదివారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. అయితే పదో తరగతి పరీక్షలు కానుందునా హైస్కూల్ ఉపాధ్యాయులు వచ్చే నెల 23 వరకు పాఠశాలలకు హాజరుకానున్నారు. సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు శనివారం ఇంటిబాటపట్టారు. బస్టాండ్ విద్యార్థులతో కిటకిటలాడింది. బస్సులు, ప్రైవైట్ ఆటోలు, జీపుల్లో విద్యార్థులు తమ ఊళ్లకు పయనమయ్యారు. జూన్ 12వరకు వేసవి సెలవులు ప్రకటించారు. 13న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉండగా మే 23 నుంచి 28వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం నుంచి విద్యార్థులకు రివిజన్ తరగతులు ప్రారంభంకానున్నాయి.