వనపర్తి, ఏప్రి ల్ 19 (నమస్తే తె లంగాణ) : వనపర్తి సమీకృత కలెక్టరేట్లో సచివాలయం మాదిరి గా సేవలందించనున్నా రు. జిల్లా అధికారుల పనులకు ఆటంకం కలుగకుండా.. ప్రజలకు సేవలందించేలా ఏ ర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌కు ప నుల నిమిత్తం వచ్చే ప్రజలు నేరుగా అధికారులను కలిసేందుకు చర్యలు తీ సుకుంటున్నారు. ఇందుకుగానూ సెక్రటేరియట్ విధానాన్ని పరిచయం చేస్తున్నారు. పా త కలెక్టరేట్‌కు ప్రజలు ఏ సమయంలోనైనా వచ్చేవారు. దీంతో కొంతమంది పనిలేకున్నా నేరుగా కా ర్యాలయంలోకి వచ్చి సిబ్బంది పనులకు ఆటంకం క లిగించేవారు. ఈ నేపథ్యంలో నూతన కలెక్టరేట్లో పాత విధానానికి స్వస్తి పలికారు. కార్యాలయానికి వ చ్చిన వారు ఏ శాఖ అధికారితో పని ఉన్నదో సంబంధిత శాఖ పేషీకి వెళ్లి సమస్యలకు పరిష్కారం పొందే వీలు కల్పించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చే వారిని నేరుగా అధికారుల వద్దకు పంపిస్తారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పనిదినాల్లో సాయంత్రం విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తున్నారు.
కార్యాలయానికి పని నిమిత్తం వచ్చిన ప్రజలకు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద పాస్‌లు ఇవ్వనున్నారు. కౌంటర్లో ఉన్న సి బ్బంది విజిటర్ పేరు, గ్రామం, సమస్య, ఏ అధికారి ని కలవాలి వంటి వివరాలు తెలుసుకొని.. సంబంధి త శాఖ అధికారికి తెలియజేస్తారు. వారి ఆదేశాల మే రకు విజిటర్స్‌కు పాస్ జారీ చేస్తారు. పాస్ తీసుకున్న వ్యక్తి నేరుగా ఆ అధికారి వద్దకు వెళ్లి సమస్యను తెలియజేసి పరిష్కారం పొందే వీలుంటుంది. అయితే, కొంతమంది వ్యక్తులు మండల లేదా మున్సిపాలిటీ స్థాయిలోని సమస్యలను కూడా కలెక్టరేట్‌కు వచ్చి విన్నవిస్తుంటారు. ఈ నూతన విధానంతో ఇలాంటి వాటికి చెక్ పడనున్నది. అయితే, ప్రజలకు విజిటింగ్ సమయాన్ని సాయంత్రం వేళల్లోనే కల్పించనున్నారు. దీంతో రైతులు, ఉద్యోగులు, ప్రజలకు పనులు విడిచిపెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పనున్నది. పనులన్నీ ముగించుకొని కలెక్టరేట్‌కు వచ్చి సమస్యలకు విన్నవించుకోవచ్చు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మధ్యాహ్నం వరకు పనులు ముగించుకొని సాయంత్రం ప్రజలకు సమయం కేటాయించే అవకాశం ఉన్నది. త్వరలో ప్రారంభం కానున్న ఈ విధానంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాస్‌ల విధానం ప్రవేశపెట్టడంతో ప్రజలకు సమస్యలకు సత్వర పరిష్కారం ల భించనున్నది. మానిటరింగ్ సులభమవుతుంది. కార్యాలయాలకు ఎవరెవరు వ చ్చారు.? సమస్య పరిష్కారమైందా? లే దా? అనే విషయంపై స్పష్టత వస్తుంది. అ న్ని శాఖల అధికారులు ఒకేచోట ఉండడం తో ప్రజలకు పని సులువవుతుంది. జిల్లా ఉన్నతాధికారి సమస్యను పరిష్కరించకపో తే నేరుగా అదనపు కలెక్టర్ల దృష్టికి తీసుకురావచ్చు. నేను కూడా అందుబాటులో ఉంటా. పాస్ అనేది రికార్డుగా ఉపయోగపడుతుం ది. ఎన్నిసార్లు వచ్చారు. దేనికోసం వచ్చారనే అంశాన్ని రికార్డు ఆ ధారంగా పరిశీలించి తమ పరిధిలోని సమస్యను పరిష్కరిస్తాం.
– షేక్ యాస్మిన్ బాషా, కలెక్టర్ , వనపర్తి జిల్లా