మిడ్జిల్, ఏప్రిల్ 18 : ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలిగి సన్మార్గంలో పయనించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సుధాబాల్రెడ్డి, బాలు, పాండు, సుదర్శన్, రాములు, కు మార్, ఆంజనేయులు, రాజు, భీంరాజు, బంగారు, లాలూ, నర్సింహ, శివప్రసాద్, వెంకటయ్య పాల్గొన్నారు.
చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలి
వేసవి దృష్ట్యా గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని జాతీయరహదారిపై ఎంపీటీసీ అభిమన్యురెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అన్ని గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజ ల దాహార్తి తీర్చాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్‌నాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, శ్రీనివాస్, విజయ్, యాదగిరి, వెంకటేశ్ పాల్గొన్నారు.