బాలానగర్, ఏప్రిల్ 18 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేష న్ షెడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యా ర్డుల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి పథం లో పయనిస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రకృతి వనాల్లో నా లుగు వేల నుంచి ఐదు వేల వరకు మొక్కలను నాటడంతో గ్రామాల్లో ఆహ్లాదకర వా తావరణం ఏర్పడుతున్నది. గ్రామాల్లో వైకుంఠధామా ల ఏర్పాటుతో దహన సంస్కార కార్యక్రమాల కు ప్రజలకు ఇ బ్బందులు తొలగాయి. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను ఇవ్వడంతో తడి, పొడి, చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. సెగ్రిగేషన్షెడ్ల్లో ఎరువులను తయా రు చేసి ఆ ఎరువులను గ్రామ పంచాయతీ వన నర్సరీల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో గ్రామాలన్నీ మోడల్ గ్రామాలుగా మారుతున్నాయని ప్రజలు అంటున్నారు.
అభివృద్ధే లక్ష్యంగా..
ప్రజల సహకారంతో అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తు న్నాం. గ్రామాల్లో ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులను చేపట్టాము. గ్రామంలో ప్రజలకు మౌలిక వసతులు సమకురేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాము. మండలంలోనే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాము.
-మెడికల్ శంకర్, సర్పంచ్ పెద్దాయపల్లి
ఆహ్లాదకర వాతావరణం
గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావర ణం ఏర్పడుతున్నది. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల ఏ ర్పాటుతో గ్రామాలకు కొత్త శోభ సతరించుకుంటుంది. సేద తీరడానికి, చిన్న పిల్లలు, ఆడుకోవడానికి పార్కులు ఎంతోగానో ఉపయోగపడుతా యి. గ్రామంలో ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులను చేపడుతాం.
-నిర్మల, సర్పంచ్ నందారం
పట్టణాలకు దీటుగా పల్లెలు
పల్లె ప్రగతి పనులతో గ్రామాలు పట్టణాలకు దీటుగా మారాయి. రో జు గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్ స హాయంతో ప్రతి ఇంటి నుంచి చెత్తను సే కరిస్తున్నాము. ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది తో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాము. డ్రైనేజీలను శు భ్రం చేయించడం వంటి పనులు చేపడుతున్నాము. పల్లెలు పట్టణాలకు సమానంగా పోటీ పడుతున్నాయి.
-తెప్పమణి యువకుడు, వనమోనిగూడ