కృష్ణ, ఏప్రిల్ 17 : లక్ష్మీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఆదివారం మండలంలోని గుడెబల్లూర్లో తె ల్లవారుజామున ఆలయ ప్రాంగాణం నుంచి భారీగా రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవ మహోత్సవానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాది మంది తరలివచ్చి స్వామివారి ఉత్సవంలో పాల్గొ ని మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవానికి ముందు మ హిళలు, యువకులు ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తు లు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
గురురావులింగంపల్లిలో…
మాగనూర్, ఏప్రిల్ 17 : మండలంలోని గురురావులింగంపల్లిలో ఆంజనేయస్వామి ఉత్సవాలు ఆదివారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు స్వామి వారికి మొ క్కులు చెల్లిస్తూ జ్యోతుల కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టా రు. అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నేరడుగం మఠం సిద్ధలింగేశ్వరస్వామి పీఠాధిపతి రథోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సింగారంలో…
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 17 : మండలంలోని సింగారంలో చింతలస్వామి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉద్దాల ఉత్సవం, మహారథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవాన్ని ప్రత్యేకంగా అలంకరించి గో వింద నామస్మరణతో రథాన్ని లాగేందుకు భక్తులు పోటీప డ్డారు. అనంతరం పల్లకీ సేవ కార్యక్రమం ఆలయం నుంచి అర్చకుడి ఇంటికి వరకు సాగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.