మహబూబ్‌నగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడిగా నిలిచారు. యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించినా ముఖ్యమంత్రి అండగా నిలిచారు. వడ్లను ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. త్వరలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,90,085 ఎకరాల్లో వరి సాగవగా.. 10,15,474 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా.
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించినా రాష్ట్రం చివరి వరకు ప్రయత్నం చేసింది. చివరి అస్త్రంగా ఢిల్లీలో ధ ర్నా చేసి యావత్ దేశానికి కేంద్రం దాష్టీకాలను తెలిసేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మీద అక్కసుతో వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందని సర్వత్రా విమర్శలు వచ్చినా.. ఢిల్లీ సర్కారులో చలనం రాలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రైతులకు అండగా ఉన్న సీఎం కేసీఆర్.. మరోసారి అన్నదాతకు నేనున్నానంటూ అభయహస్తం అందించారు. యాసం గి ధాన్యమంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారింది. ఈ విషయంపై మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. రైతుల ను ఆదుకోవాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండాపోయింది.
రూ.1960 మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనడమే కాకుండా సా ధ్యమైనంత త్వరగా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నారు. ఇప్పటికే రైతుబంధు, నిరంతర ఉచిత విద్యుత్, సాగునీ రు అందిస్తూ అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చి రైతు బాంధవుడిగా నిలిచారు. ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగిలో 3,90,085 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఉత్పత్తి అంచనా 10,15,474 మెట్రిక్ టన్నులు కాగా.. రైతులు బహిరంగ మార్కెట్లో కొంత, మరికొంత విత్తనం కోసం, ఇంటి అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం ఉం ది. అయితే, రైతులు నేరుగా గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్ర భుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నదని కేబినెట్ విమర్శించింది. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది. అయితే, ప్ర జలు, రైతులతో నిత్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్ర భుత్వం రైతుల ప్రయోజనాలపై నిబద్ధతను ప్రదర్శించాలని సీఎ కేసీఆర్ తెలిపారు. వద్దన్నా రాష్ట్రంలో కొంతమంది రైతులు వరి సా గు చేశారు. ఇప్పుడు వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ క న్న బిడ్డలను కాపాడుకునే తండ్రి మనస్తత్వంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది.
సివిల్ సైప్లెస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన గ్రా మగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, మంత్రులందరూ తమ జిల్లాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించాలని.. కలెక్టర్లు, సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించుకొని, గన్నీ బ్యాగుల సరఫరా, తదితర సమస్యలు లేకుండా సమర్థవంతంగా కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని సీఎం తెలిపారు. యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్, సివిల్ సైప్లెస్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
సీఎం.. రైతుల పక్షపాతి
యాసంగి ధా న్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సీఎం కే సీఆర్ ప్రకటించడం మంచి పరిణామం. ముఖ్యమంత్రి మ రోసారి రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొన్నది. ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదోనని ఆందోళన ఉండేది. రైతులు నష్టపోకుం డా సీఎం కేసీఆర్ ముందుకొచ్చి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం హర్షణీయం.
–కుర్మయ్య, రైతు, అవుసులికుంట, లింగాల మండలం
గుబులు తీరింది..
రాష్ట్ర ప్రభుత్వ మే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని సీ ఎం కేసీఆర్ ప్రకటనతో పాణం లేచొచ్చింది. కేంద్రం కొనమని చెప్పినప్పుడు గుబులు పడ్డాం. అది ఇప్పుడు తీరింది. ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1960 మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం శుభ పరిణామం.
–సుదర్శన్, రైతు,
జిల్లెడుదిన్నె, వడ్డేపల్లి మండలం
సీఎంకు రుణపడి ఉంటాం..
ప్రతి గింజనూ కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుల ప్రా ణాలు తీస్తున్నది బీజేపీ ప్రభుత్వం.. ప్రాణాలు కాపాడేది టీఆర్ఎస్ సర్కార్. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
– భగవంత్‌రెడ్డి, రైతు, దొడగుంటపల్లి