వనపర్తి రూరల్, ఏప్రిల్ 12 : ‘నేటి బాలలే రే పటి పౌరులు’ అనే నానుడిని చందాపూర్ గ్రా మం నిజం చేస్తున్నది. వనపర్తి జిల్లాలోని గ్రామా ల్లో చిన్నారుల భవితవ్యం చిన్నాభిన్నం కాకూడదనే ఉద్దేశంతో కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా వనపర్తి మం డలంలోని చందాపూర్ గ్రామాన్ని మోడల్‌గా ఎం చుకున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వ యం చేశారు. బాలకార్మికులు, బాల్యవివాహాలు లేకుండా చూసేందుకు ప్రజలకు అవగాహన క ల్పించారు. చిన్నారులకు మెరుగైన విద్య, ఆట, పాటలు, పౌష్టికాహారం అందించేలా పాఠశాలల ను బలోపేతం చేశారు. వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ చదువుపై ఆస్తకి కలిగించారు. ప్రతి అంశం సులువుగా అ ర్థం చేసుకునేలా బోధించారు. డిజిటల్ తరగతులతో ప్రపంచంలోని వింతలు, విశేషాలను వివరిస్తూ చిన్నారుల ఉన్నత విద్యకు పునాది వేశారు. చదువులేక వెనకబాటుతనాన్ని గమనించిన అధికారులు గ్రామ పెద్దలతో కలిసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాలికలకు చదువు ఆవశ్యకత, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వి వరించారు. ఉప ఆరోగ్య కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వారికి తగిన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. అలాగే చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచే లా ప్రకృతివనంలో పార్కులను ఏర్పాటు చేశారు.
అంగన్వాడీలపై ప్రత్యేక శ్రద్ధ..
గ్రామంలో మూడు అంగన్వాడీలు ఉన్నా యి. అందులో చిన్నారులకు పౌష్టికాహారం అం దించడమే కాకుండా ఆటాపాటలు, ఆడియో, వీ డియోలతో విద్యాబోధన చేస్తున్నారు. ప్రతి రో జూ చిన్నారులకు గుడ్లు, పాలు ఇస్తున్నారు. ప్లేవే మెథడ్స్‌లో భాగంగా ప్రత్యేక ఆట వస్తువులతో చదువు చెబుతున్నారు.
జాతీయ అవార్డుకు ఎంపిక ఇలా..
గతేడాది డిసెంబర్ 21న దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కారం 2020-2021 జాతీయ స్థాయి ఎంపిక కోసం నామినేషన్లు ఆహ్వానించింది. నాలుగు విభాగా ల్లో రాష్ట్రం నుంచి 16 దరఖాస్తులను జాతీయస్థాయి ఎంపిక కోసం పరిశీలనకు పంపారు. ప్రతి ఏటా ఏప్రిల్ 24న పంచాయతీ దివస్ రోజున జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన గ్రామ పంచాయతీలకు పురస్కారాలు అందజేస్తారు. ఇందులో భాగంగా చందాపూర్ గ్రామ పంచాయతీని చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ కింద అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో ఈ ఏ డాది మార్చి 20వ తేదీన కేంద్ర పంచాయతీ రా జ్ మంత్రిత్వ శాఖ జాతీయ సభ్యులు చందాపూ ర్ను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలు, పా ఠశాల, ఆరోగ్య ఉప కేంద్రాలను పరిశీలించి అక్క డి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల అధికారులు చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ కింద జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు.
మంత్రి, అధికారుల కృషితో..
వెనుకబడిన గ్రామ పంచాయతీల్లో విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం అని రకాలుగా కృషి చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్ట ర్ షేక్‌యాస్మిన్ బాషా ప్రత్యేక చొరవతో గ్రా మాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. చి న్నారుల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సా రించారు. గ్రామస్తులు, అధికారుల కృషితోనే ఇదంతా సాధ్యమైంది. చైల్డ్ ఫ్రెండ్లీ జీపీ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉన్నది.
– చిన్నారెడ్డి, సర్పంచ్, చందాపూర్