నవాబ్‌పేట, ఏప్రిల్12: రైతులు వ్యవసాయ బోర్లకు విద్యుత్ వినియోగం కోసం డీడీలు కట్టిన నాలుగైదు రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏర్పాట్లు చేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏడీ తౌర్యానాయక్ పేర్కొన్నారు. మండలంలోని కొండాపూర్, ఆర్సీపూర్, లోకిరేవు, హజిలాపూర్, పోమాల, నవాబ్‌పేట, కొల్లూరు తదితర గ్రామాల్లో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏడీ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీ మాట్లాడుతూ గడిచిన ఐదు నెలల్లో మండలంలో పెండింగ్‌లో ఉన్న 418మంది రైతుల డీడీలకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
అవసరమున్న రైతులకు 78ట్రాన్స్ఫార్మర్లు బిగించామన్నారు. ఎవరికైనా ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటే డీడీలు కడితే నాలుగైదు రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గడిచిన నాలుగు నెలల్లో 1600 స్తంభాలు రైతులకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలకు మధ్యదళారీలను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. నేరుగా తనను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల లెన్మెన్లు, రైతులు ఉన్నారు.
నష్టపరిహారం చెక్కులు పంపిణీ
కోయిలకొండ ఏప్రిల్ 12: మండలంలోని ఆయా గ్రామా ల్లో విద్యుదాఘాతంతో మృతిచెందిన పశువులకు నష్టపరిహారం చెక్కులను విద్యుత్ ఏడీ యశోద మంగళవారం పంపిణీ చేశారు. తిర్మలంపల్లికి చెందిన డాక్యానాయక్‌కు రూ.40వేలు, సత్తిరెడ్డికి రూ.40వేలు, సంగనోనిపల్లి గొల్ల ఆశన్నకు రూ.40వేలు, అయ్యవారిపల్లి వెంకట్రామిరెడ్డికి రూ.40వేలు, వింజామూర్ గోటూర్ నర్సింహులుకు రూ. 40వేల చెక్కులు అందజేసినట్లు ఏడీ వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ, అయ్యవారిపల్లి ఉపసర్పంచ్ మోహన్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.