మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 10 : స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదీద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్నందల్పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రతిఇంటికీ తిరుగుతూ కరపత్రాల ద్యారా స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, మహిళా సంఘాలు ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు.
స్వచ్ఛభారత్‌లో భాగంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ స్వచ్ఛసర్వేక్షణ్ 2022లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం దేశంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 200వ ర్యాంక్ సాధించగా, రాష్ట్రం లో 6వ ర్యాంకు సాధించింది. ఈ సారి మొదటి స్థానం సాధించేదిశగా మున్సిపల్ పారిశుధ్య విభాగ అధికారులు రవీందర్‌రెడ్డి, వాణికుమారి, గురులింగం, హెల్త్‌అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదీద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. వాల్ పెయింటింగ్ సైతం వేయిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది, జవాన్లు కూడా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో పాల్గొందాం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మనదేశంలో అన్ని నగరాలకు కవర్ చేస్తూ భారత ప్రభుత్వగృహ, పట్టణ వ్యవహరాల మంత్రిత్వశాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహిస్తున్నది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ 2022లో మొదటి ర్యాంకు సాధించేందుకు http://ss-cf.sbmurban.org/#/feedback లింక్‌ను ఓపెన్ చేసి నాలుగు ప్రశ్నలకు సమాధానం అవును అన్ని ఇవ్వాలి. ఇందులో నాలుగు ప్రశ్నలు వస్తాయి. ఇం దులో మీరు చదివి అవును, కాదు సమాధానం ఇస్తేచాలు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మహబూబ్‌నగర్‌ను మొదటి స్థానంలో రావడానికి కృషి చేయాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు.
మొదటి స్థానంలో నిలుపుదాం
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్లు, ఇండ్ల మధ్య వేయవద్దు, తడి, పోడి చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ కలిసికట్టుగా కృషిచేద్దాం.
– కేసీ నర్సింహులు, మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దడానికి ఇంటింటి చెత్తసేకరణ కార్యక్రమం చేపడుతున్నాం. మున్సిపాలిటీ స్వచ్ఛసర్వేక్షన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ 2022లో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని మహబూబ్‌నగర్‌ను మొదటిస్థానంలో నిలపాలి.
-ప్రదీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్