మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 9 : మెరుగైన విద్యను అందిచడంలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం గురుకులాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నది. మైనార్టీ విద్యార్థుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 200లకుపైగా గు రుకులాలు ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్రంలోని 121 పాఠశాలలను జూనియర్ కళాశాలలు గా అప్గ్రేడ్ చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 10 పాఠశాలలు ఉండగా, ఇందులో 6 బాలురు, నాలుగు బాలికల పాఠశాలలు ఉన్నా యి. వీటిని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చే శారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచే ప్ర వేశాల కోసం పదోతరగతి పాసైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఐదో తరగతిలో చేరేందుకు కూడా అవకాశం కల్పించారు. కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈ సీ, సీఈసీ, వృత్తి విద్యా కోర్సులైన ఎంఎల్టీ, ఈ టీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. tmreis.telagana.gov.inలో ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. మే 21న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష ఉండనున్నది.
అర్హులు వీరే..
మే నెలలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఇంటర్ ప్రవేశాలకు అ ర్హులు. పదిలో 6 జీపీఏ పైగా ఉత్తీర్ణత సాధించా లి. 18 ఏండ్లలోపు వయస్సు ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో వారి కి రూ.1.5 లక్షలు. పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలు మించరాదు. నాల్గో తరగతి చదివిన వి ద్యార్థులు ఐదో తరగతికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల విధానం..
ప్రతి కళాశాలలో రెండు కోర్సులకుగానూ ఒ క్కో గ్రూపులో 40 చొప్పున 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో మైనార్టీలకు 30, ఇతరులకు 10 సీట్లు కేటాయిస్తారు. మైనార్టీలో ముస్లింలకు 64 శాతం, క్రైస్తవులకు 7, జై న్, పార్సీ, బుద్దిస్ట్, సిక్కులకు కలిపి 4 శాతం వంతున మొత్తం 75 శాతం, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, బీసీలకు 12 శాతం చొప్పున 25 శా తం భర్తీ చేస్తారు. పాఠశాలల్లో ఇదే విధానం ఉంటుంది. తల్లిదండ్రులు కళాశాల, పాఠశాలను సంప్రదిస్తే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని, మార్గదర్శకాల ప్రకా రం ప్రవేశాలు కల్పించనున్నట్లు టె మ్రీస్ రీజినల్ కో ఆర్డినేటర్ ఖా జా జమీల్అహ్మద్ తెలిపారు.