మరికల్, ఏప్రిల్ 9 : కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభు త్వ పాఠశాలలను సుందరంగా మారుస్తామని, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ల క్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మధ్వార్లో ‘మన ఊ రు- మన బడి’ కార్యక్రమాన్ని ఎస్.ఆర్.రెడ్డి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థ ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన ఊ రు- మన బడి’ కార్యక్రమం ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. మధ్వార్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం రూ.24,45ల క్షలను మంజూరు చేశామన్నారు. పాఠశాల ఆవరణలో గుడి ఉండడంతో గుడి కంటే బడే మిన్న అని, గుడి ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుందని, బడి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్త్తుందని ఆయన చెప్పారు.
పాఠశాలలో మరుగుదొ డ్ల నిర్మాణానికి రూ.6లక్షలు, తాగునీటి వసతి కోసం రూ. 2.5లక్షలు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.లక్ష, విద్యుత్ సౌకర్యం కోసం రూ.2లక్షలు, పాఠశాల సుందరీకరణ కో సం రూ.4.75లక్షలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల బెంచీలు, కుర్చీల కోసం రూ.4లక్షలు, తరగతి గదుల మరమ్మతుల కోసం రూ.3.5లక్షలు, బోర్డుల కేటాయింపు కోసం రూ.70 వేలు మంజూరు చేశామన్నారు. పా ఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు కూడా సహకరించాలని సూచించా రు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏ డాది నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని ప్ర వేశ పెట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలకు వస్తే ఆహ్ల్లాదకరమైన వా తావరణం ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థి రాజ్యలక్ష్మితో పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉందని, ప్రతిరోజూ ఉపాధ్యాయులు సమయానికి వస్త్తున్నారా లేదా.. గుడ్లు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు.. పండ్లు ఇస్త్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూ చించారు. అనంతరం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, సర్పంచ్ పూణ్యశీ ల, ఎంపీటీసీ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రవికుమార్, అ దనపు కలెక్టర్ పద్మాజారాణి, డీఆర్డీఏ పీడీ గోపాల్‌నాయక్, డీఈవో లియాఖత్ అలీ, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
‘పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా’
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రాఘవేందర్‌కు సభ్యత్వం ఉండడం వల్ల భా ర్య అర్చనకు వచ్చిన బీమా రూ.2లక్షల చెక్కును శనివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల కుటుంబాలకు అం డగా ఉంటానని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, రాఘవేందర్ కుటంబాన్ని ఆదుకుంటానన్నారు. విద్యుత్ శాఖ నుంచి ఆర్థికసాయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్, ఎంపీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ రవికుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.