నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 7: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తిమ్మాజిపేట మండలం ఇప్పలిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ బుడ్డనోళ్ల నర్సింహరాజు, వెంకట్రాములు, ఆంజనేయులు, ఎల్లయ్య, పొట్ల యాదయ్య, కర్రె మశన్న, తిరుపతయ్య, ఇస్తారయ్య, నాగరాజు, చందు, మునయ్య, విజయ్, రాజు, వెంకటయ్య, ఆంజనేయులు ఉన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ పాల్గొన్నారు.