పోరుకు భారీగా కదిలొచ్చారు..
వడ్లు కొనుగోలు చేయకుండా తెలంగాణ అన్నదాతను ఆగమాగం చేస్తున్న కేంద్రంపై పోరుకు ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఇతర వాహనాల్లో భారీగా తరలొచ్చారు. ఒకప్పుడు రాష్ట్రంలో కేవలం 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయగా.. ఇప్పుడు 1.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. రైతులు బాగుపడ్డారని సంతోషించాల్సింది పోయి కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తున్నది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలకు రైతుల సమస్యలు పట్టడం లేదు. సిగ్గు ఉంటే మోదీ, గోయల్ ఇంటి ఎదుట ఆందోళన చేసి వడ్లు కొనేలా చూడాలి. తమకు పోరాటాలు కొత్తకాదు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
ఈడీ, గీడీకి భయపడం..
కేంద్రంపై తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ఉద్యమం.. దేశ రైతుల తలరాత మారుస్తుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజా, రై తు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. నల్లచట్టాలపై ఆందోళన చేస్తే రైతులను చం పేందుకు కూడా బీజేపీ నేతలు వెనకాడలేదు. అయినా, కేం ద్రం మెడలు వంచి నల్ల చట్టాల ను రద్దు చేసేవరకు ఉద్యమిం చారు. అలాగే బీజేపీ సర్కార్‌ను గద్దె దింపే వరకు తమ ఉద్య మం సాగుతుంది. కేంద్రంపై పోరాటం చేసే, ప్రశ్నిస్తున్న వారిపై ఈడీ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈడీ, గీడీకి భయపడేది లేదు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి గోయల్ మోసం చేశారు. రైతుల కోసం సీ ఎం కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఉద్యమం చేయనున్నారు. ప్రతి గింజనూ కొనే వరకు ఉద్యమం ఆగదు.
కిమ్మనని బీజేపీ నేతలు..
ఓవైపు యాసంగిలో పారాబాయిల్డ్ బి య్యం కొనమని కేంద్రమంత్రి గోయల్ అం టడు.. మరోవైపు అప్పటికే రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మా త్రం వరి వేయాలన్నరు. తప్పకుండా కొనేలా చూస్తామని రైతులను తప్పుదారి పట్టించారు. బీజేపీ నేతలు చెప్పినట్లుగా రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేసేందుకు మాత్రం కేంద్ర మంత్రి ఒప్పుకోవడం లేదు. ఈ విషయంపై రాష్ట్రంలోని బీజేపీ నేతలు కిమ్మనడం లేదు. రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ నేతల తీరు క్షమించరానిది. కేంద్ర మంత్రి నూకలు తినమంటున్నాడు. ఇదెక్కడి న్యాయం. ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధానికి లేఖలు రాస్తే స్పందన లేదు. వారు స్పందించినా స్పందించకపోయినా.. కేంద్రంపై పోరాటం మాత్రం ఆగదు.
– ఎస్.రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే
ధాన్యం కొనేవరకు పోరాటం..
ధాన్యం సేకరణలో పంజాబ్ రాష్ర్టానికో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? తెలంగాణపై కేంద్ర సర్కార్ తీరును నిరసిస్తూ పోరాటం కొనసాగుతుంది. గతంలో బీజేపీ సర్కార్‌పై ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. దేశంలో రైతుల కోసం చేస్తున్న పోరాటాల్లో సీఎం కేసీఆర్ రైతులకు దిక్సూచిగా మారారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం దేశానికి మంచిది కాదు. ఆహార భద్రత చట్టాన్ని మోదీ తుంగలో తొక్కారు. రైతులను ఇబ్బంది పెడితే పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ధాన్యం కొనే వరకు ఉద్యమిస్తాం.
– జైపాల్ యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే
నట్టేట ముంచుతున్న కేంద్రం..
దేశంలో రైతులకు నష్టం జరిగితే ఆం దోళన చేయాల్సిందే. ఇంతకంటే ముఖ్య మైన కార్యక్రమం ఏముంటుంది. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణకు నీళ్లు, కరెంట్ వచ్చాయి. రైతులు బం గారు పంటలు పండించు కుంటున్నారు. రైతులు బాగుపడు తుంటే కేంద్రం వడ్లు కొనకుండా నట్టేట ముంచుతున్నది. కనీస మ ద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చిన ఉ ద్దేశాన్ని బీజేపీ సర్కార్ పక్కదారి పట్టి స్తున్నది. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేసే ప్రధాని మోదీ తెలంగాణ రైతులకు న్యాయం చేస్తాడని ఏ విధంగా భావించాలి. కేంద్రంపై పోరాటం మాత్రం ఆగే ప్రసక్తే లేదు.
– అంజయ్య యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే
వడ్లు కొనాల్సిందే..
వరి కంకులు చేత పట్టుకుని రోడ్లపై పడిగాపులు కాసే రోజులు వస్తాయని ఎన్నడూ అనుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతుందో అర్థం కావ డం లేదు. కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం. రైతు సంక్షేమం కోరుతున్నామని ఉత్తగ చెబుతున్నారే తప్పా ఆచరణలో పెట్టడం లేదు. – చెన్నయ్య, ఏనుగొండ, మహబూబ్‌నగర్
గిట్ల చేస్తే ఎట్లా..
రైతులకు మంచి చేస్తాం అని చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇది సరికాదు. గిట్ల ఇబ్బందులు పెడితే తమ ఉసురు తగుల్తది. రైతును పట్టించుకోని ఏ సర్కారు కూడా బాగుపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చెబుతున్నా.. కేంద్రం ఎందుకు గిట్ల చేస్తుందో తెలుస్తలేదు. కచ్చితంగా వడ్లు కొనాల్సిందే. – పెంటప్ప, గోపన్‌పల్లి, దేవరకద్ర
వ్యవసాయం తప్ప ఏం తెల్వదు..
మాకు పొద్దున లేచినప్పటి నుంచి వ్యవసాయం చేయడం తప్ప ఏం తెల్వదు. వడ్లు కొనం అంటే ఎట్లా. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ సర్కార్ చెబుతున్నట్లు కేంద్రం వడ్లు కొనుగోలు చేయాల్సిందే. అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాం.
– యాదవరెడ్డి, పోతన్‌పల్లి
పదెకరాల్లో సాగు చేశా..
పది ఎకరాల్లో వరి సాగుచేశాం. బీజేపీ నాయకులు వడ్డు కొనుగోలు చేసే బాధ్యత తమదే అని చెప్పినందుకు వరి వేసిన. గిప్పుడేమో వాళ్లు పట్టించుకోవడం లేదు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వరి కొనుగోలు చేయాల్సిందే. లేకుంటే రైతుల ఆగ్రహానికి బలికాక తప్పదు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తరిమికొడతాం. – వీరారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం