మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 14వ తేదీన దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం వివిధ శాఖల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో యూ నిట్ల పంపిణీకి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మనఊరు-మనబడి కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూ చించారు. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అవసరమైన పనులను చేపట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఉపఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. అలాగే వేసవి దృష్ట్యా హరితహా రం మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. గిరివికాసం పథకం యూనిట్లను గ్రౌండింగ్ చే యాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఉచి త కోచింగ్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు.