అచ్చంపేట, ఏప్రిల్ 6 : రైతుల బాగు కోసం అవసరమైతే అచ్చంపేట ప్రజలు ఆత్మబలిదానానికైనా వెనుకాడరని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అసాధ్యమనుకున్న కేఎల్ఐ కాలువ పొడిగింపును సు సాధ్యం చేసి ప్రజలరుణం తీర్చుకున్నానన్నారు. బుధవారం మండలంలోని పుల్జాల-చంద్రసాగర్ కాలువ పొడిగింపు పనులకు రాయిచేడు గేటు సమీపంలో ఎం పీ రాములు, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, వాణీదేవి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఇరిగేషన్ సీఈ హమీద్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఈ ప్రాంతం లో పుట్టకపోయినా ఇక్కడి ప్రజల కోసం ఇక్కడే మరణిస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కేఎల్ఐ కాలువ పొడిగింపునకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మం జూరు చేయించినట్లు తెలిపారు. ఈ కాలువను ఏడాదిలోగా పూర్తి చేసి దాదాపు 25 గ్రామాల రైతులకు 16 వేలు ఆయకట్టుకు సాగునీరు అందించడమే కాకుండా గీరాయికుంటను నింపుతామన్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన 5 నుంచి 10 వేల ఎకరాలు ఉంటే అదనం గా సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు.
600 ఎకరాలు భూములు కోల్పోయే రైతులు పెద్ద మనస్సు చేసుకొని సహకరించాలని కోరారు. వారి ని కడుపులోపెట్టి కాపాడుకుంటానని, రైతుల సహకా రం లేకుంటే ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంతో పాటు ఏదో ఒక పథకం కింద లబ్ధిచేకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. కొందరు అప్పుడే కోర్టుకు వెళ్లి కాలువ పనులు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అలాంటి వాళ్లను తగినబుద్ధి చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. ఉమామహేశ్వరం, చెన్నకేశవ రిజర్వాయర్లకు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. అప్పర్ప్లాట్లోని ప్ర తి గుంటకూ సాగునీరు అందించి తీరుతానన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ కాలువ మంజూరు కో సం ఎమ్మెల్యే ఎంతో కృషిచేశారని తెలిపారు. ఇద్దరం కలిసి ఈ ప్రాంతం అభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు. రూ.1200 కోట్లతో కల్వకుర్తి-సోమశిల మీదుగా నం ద్యాల జాతీయ రహదారి సాధించిన ఘనత తనదేనని అన్నారు. రైల్వేలైన్ కోసం సైతం కృషిచేస్తానని అన్నారు.
ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ ఒకప్పుడు వలసల జిల్లాగా పిలువబడ్డ పాలమూరు నేడు సీఎం కేసీఆర్ హ యాంలో రెండు పంటలకు సాగునీరు అందతుందన్నారు. కేంద్రం దిగొచ్చే వరకు కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ త్వ రలోనే ఈ ప్రాంతానికి సాగునీరు తెచ్చేందుకే నేడు ఇ క్కడ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి మాట్లాడుతూ నల్లమల ప్రాంతానికి సాగునీరు తీసుకురావడంలో గువ్వల కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, ఎస్ఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ సంజీవరావు, ఎంపీపీ శాంతాబాయి, జెడ్పీటీసీలు మంత్రియానాయక్, ప్రతాప్‌రెడ్డి, రాంబాబు, భరత్‌ప్రసాద్, సర్పంచులు బాలింగం, అరుణమ్మ, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, నాయకులు నర్సింహాగౌడ్, తులసీ రాం, చంద్రశేఖర్‌రెడ్డి, అమినొద్దీన్, గోపాల్‌నాయక్, రాజేశ్వర్‌రెడ్డి, రాజిరెడ్డి, సురేందర్, చెన్నకేశవులు, భూ పాల్‌రావు, రవీందర్రావు, చంద్రమౌళి, వెంకటేశ్వర్రా వు, శ్రీనివాసరావు, దేవేందర్‌రెడ్డి, శివ, లోక్యనాయక్, శంకర్, బాలు, నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.