కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొల్లాపూర్ రైతులు వాణిజ్య పంటలవైపు మొ గ్గుచూపుతున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అధికారుల సలహాలు, సూచనలతో తమ ఆలోచనలను ఆచరణలో పెడుతూ అధిక ఆదాయం గడిస్తున్నారు. కొల్లాపూర్ రైతులు ఇప్పటికే ఆపిల్‌ను మరిపించే జామ తోట లు, ఎండాకాలంలో పుచ్చకాయ సాగు చేపట్టి లాభాల బాటలో పయనిస్తున్నారు. అదేవిధంగా విదేశాల్లో పండించే ఎడారిలో పండే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో సాగుచేస్తున్నారు. గ్రామానికి చెందిన యువరైతు కుందేళ్ల శివుడు తన నాలుగెకరాల్లో ఎకరా పొలంలో డ్రా గన్ఫూట్ మొక్కలు నాటి మూడేండ్లుగా సాగుచేస్తున్నా డు. డ్రాగన్ ఫ్రూట్ (పండు) కరోనా వైరస్ రూపాన్ని ఆ విష్కరించిన విధంగా ఉంటుంది. దాదాపు 8 ఫీట్ల ఎ త్తున సిమెంట్ పోల్ ఎత్తు పెరిగి చెట్టుపైన నలుదిక్కులా పొడవాటి కలమంద పట్టలు విస్తరించినట్లు ఉంటాయి. వీటి పక్కలకు కలమంద పట్టలకు ముండ్లు ఉన్నట్లు పైభాగం ఉంటుంది.
ఎడారి మొక్క..
డ్రాగన్ ఫ్రూట్ మొక్క విదేశాలకు చెందిన ఎడారి మొ క్క. దీనిని పిటాయ లేదా స్ట్రాబెర్రిపియర్ అని పిలుస్తారు. ఇది కాక్టెసమీ జాతికి చెందినది. ఇది గుండ్రటి ఆ కారంలో చుట్టు ముళ్లున్నట్లు పండు కాస్తుంది. మూడు రకాల రంగును కలిగి ఉంటుంది. 1) పైభాగం గులాబీరంగు కలిగిఉండి లోపలి కండ తెల్లగా ఉంటుంది. 2) బయటి భాగం ఎర్రటిరంగు ఉండి లోపలి భాగం గులా బీ రంగును కలిగి ఉంటుంది. 3) పైభాగం పసుపు రం గు ఉండి లోపలి భాగం కూడా తెలుపు ఉంటుంది. దా నికి కత్తరిస్తే కళ్లకు ఇంపుగా మూడు రంగుల్లో కలర్ఫుల్గా ఉంటుంది. డ్రాగన్‌ఫ్రూట్ మొక్క వర్షాధారంగానే పెరుగుతుంది. తక్కువ నీటితో పంట దిగుబడి ఇస్తుంది. సాగుకు మొదటి ఏడాది పెట్టుబడి అధికంగానే ఉంటుం ది. 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. ఏటా డ్రాగన్ తోట రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి.
పోషక విలువలు..
డ్రాగన్ఫ్రూట్లో ఎక్కువగా ప్లానోయిడ్స్ ఫినోలిక్ ఆసి డ్, కాల్షియం, పొటాషియం అధికంగా ఉండటం వల్ల శ రీర వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. పంటకాలం 18 నెలల నుంచి ప్రారంభమై 30 ఏండ్ల వరకు ఉంటుంది. తక్కువ లోతైన నేలలనుంచి అతి లోతైన నేలలు, గరప నేలలనుంచి ఇసుక నేలల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందని భావించి కరోనా సమయంలో ఎక్కువగా తీసుకునేవారు.
సాగుచేసే విధానం..
డ్రాగన్‌ఫ్రూట్ పంటను కొమ్మ కత్తరింపుల ద్వారా సాగుచేస్తారు. ఈ మొక్కలను ఆగస్టు నుంచి నవంబ ర్ వరకు నాటుకోవచ్చు. ఈ మొక్కలను 8అడుగుల ఎత్తుగల సిమెంట్ స్తంభాలకు నాటుతారు. ఒక ఎకరాలో దాదాపు 2వేలకుపైగా మొక్కలను నాటుతారు. ఒక్కో స్తంభం నాటేటప్పుడు వరుసకు వరుసకు మ ధ్యన 8.5అడుగుల దూరం, స్తంభానికి స్తంభానికి మ ధ్యన 10అడుగుల దూరం ఉండేటట్లు సరిచూసుకోవాలి. సిమెంట్ స్తంభంపై సిమెంట్ రింగులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రింగులు ఏర్పాటు చేసుకోకుండా కొందరు రైతులు సిమెంట్ పోల్‌పై మోటార్ సైకిల్ టైర్లును ఉపయోగిస్తున్నారు. డ్రాగన్ ప్రూట్ మొ దటి పంట 180రోజుల్లో చేతికి వస్తుంది. ఈ పంట మొదటి ఏడాది నుంచి నాలుగేండ్ల వరకు 4 టన్నులు, 5వ ఏడాది నుంచి 10 టన్నుల వరకు కాపు వస్తుంది.
కొమ్మ కత్తిరింపులతో విస్తరణ
మొదటగా డ్రాగన్ మొక్కలను తక్కువగా తీసుకొ చ్చి సిమెంట్ స్తంభాల చుట్టూ నాలుగు మొక్కలు నా టుకోవాలి. అధిక విస్తీర్ణంలో సాగుచేసుకోవాలంటే కొమ్మ కత్తరింపులు చేసుకొని కత్తిరించిన కొమ్మలను నాటుకుంటే పంట విస్తరించుకోవచ్చు. మొదట్లో కొన్ని మొక్కలను కొంటే సరి ఎన్ని ఎకరాలలోనైనా ఈ పంటను విస్తరించుకొని సాగుచేసుకోవచ్చు.
మూడు నెలల పాటు కాపాడుకోవాలి..
మార్చి నుంచి మే చివరినాటికి డ్రాగన్ తోటను ఉష్ణోగ్రతలనుంచి కాపాడుకోవాలి. నీటిని అందుబాటులో ఉంచాలి. జూన్ మొదటి వారం నుంచి నవంబర్ వరకు పూత వస్తుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు పంట చేతికొస్తుంది. అధిక ఉష్ణోగ్రతల నుంచి మొక్కలను రక్షించుకోవాలంటే మొక్కలను గోనె సంచులతో చుట్టాలి. మొక్కల మొదళ్లను ఎండుటాకులతో కప్పివేయాలి. ఇలా చేయడం వల్ల నీరు ఆవిరి కాకుండా తేమగా ఉంటుంది.
– లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్
అర ఎకరాలో సాగుచేశా..
నా కొడుకు యూట్యూబ్‌లో డ్రాగన్‌ఫ్రూట్ సాగు వివరాలు తెలుసుకున్నాడు. దీంతో గుంటూరు నుంచి డ్రాగన్‌ఫ్రూట్ మొక్కలు తీసుకొచ్చి అర ఎకరాలో నాటాను. మూడేండ్లుగా సాగుచేస్తూ పంట విస్తరించాను. ఒక్క పండుకు రూ.100 నుంచి 200 వరకు డిమాండ్ ఉంటుంది. ఎకరాకు రూ.4.50లక్షలు ఖర్చవుతుంది. లాభాలు కూడా బాగానే ఉంటాయి. ఒకసారి పంట వేస్తే 30ఏండ్ల వరకు కాపుకాస్తుంటాయి. మధ్య మధ్యలో పండుటాకులుంటే వేరుచేయాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటించడంతో అధిక లాభాల వస్తున్నాయి.
– కుందేళ్ల శివుడు, రైతు, ముక్కిడిగుండం