ఊట్కూర్, ఏప్రిల్ 2 : మండలవ్యాప్తంగా ప్రజలు శనివారం ఉగాది ‘శుభకృత’ నామ పర్వదిన వేడుకలను ఘ నంగా జరుపుకొన్నారు. ఉత్సవ వేడుకలను పుర్కరించుకొ ని గుమ్మాలను మామిడి ఆకుల తోరణాలతో ముస్తాబు చే శారు. మహిళలు, యువతీ యువకులు భక్తిశ్రద్ధలతో ఆలయాలను దర్శించుకొని నైవేద్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దజట్రం, బిజ్వారం పడమటి ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమంతుడికి అభిషేకం, అలంకరణ, నైవే ద్యం, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించా రు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టా రు. ఆర్యసమాజ్ ప్రధాన్ కనకప్ప ఆర్య ఆధ్వర్యంలో ఆర్యసమాజ్ మందిరంలో దంపతులు పాల్గొని దేవ యజ్ఞం జరి పారు. ఆయా గ్రామాల్లో షడ్రుచులతో తయారు చేసిన ప చ్చడిని సేవించారు. వేద పురోహితుల ఆధ్వర్యంలో పం చాంగ శ్రవణం వినిపించారు.
గ్రామాల్లో పండుగ వాతావరణం
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను శనివారం పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంత ఊర్లకు చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది. మామిడి తో రాణాలు, పూలతో ఇండ్లను అలంకరించారు. షడ్రుచులతో కూడిన పచ్చడి తయారు చేసి ఆరగించారు. ప్రజలు పలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. బంధువులు, మిత్రులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సాయంత్రం సమయంలో పళ్లలోని రాఘవేంద్రస్వామి మఠం, శక్తిపీఠం, సింగార్బేస్లోని శివాలయంలో పంచాం గ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మండలంలోని జా జాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లితోపాటు అన్ని గ్రామాల్లో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పచ్చడి తయారు చేసి, ప్రత్యేక వం టకాలతో ఆరగించారు. జాజాపూర్ ఆర్య సమాజ్‌లో య జ్ఞం నిర్వహించి ధ్వజారోహణాన్ని ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల మైదానంలో షడ్రుచుల పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఆనందోత్సవాలతో…
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. తెలుగు నూతన ‘శుభకృత’ నామ సంవత్సర ఉగాది పండుగను ఆనందోత్సవాలతో మండల ప్రజలు శనివారం జరుపుకొన్నారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ప్రజలు ఆరగించారు. గ్రామాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గ్గొన్నారు.
శుభ ఫలితాలు ఇవ్వాలి
మండలంలో ‘శుభకృత’ తెలుగు ఉగాది పర్వదినం వేడుకలను ప్రజలు ఘనంగా ని ర్వహించారు. ఆయా ఆలయాల్లో ‘శుభకృత’ నామ సంవత్సరం ఉగాది శోభ సంతరించుకుంది. ప్రజలు ఆలయాల ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు ఉగాది ‘శుభకృత’ నామ సంవత్సరంలో ప్రజలు, రైతులు, విద్యార్థులకు శుభ ఫలితాలు ఇవ్వాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా ఫలించాలని ఆకాంక్షించా రు. మండలంలోని కర్నిలో వెలిసిన గుంటిరంగ స్వామి ఆలయంలో ‘శుభకృత’ నామ సంవత్సరం పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పల్లకీ సేవలో స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆలయంలో వేదపండితులు పంచాంగ శ్రవణం పఠనం చేశారు. అనంతరం షడ్రుచులతో తయారు చేసిన పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో పంచాంగ శ్రవణం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించారు. శనివారం ఉగాది శుభకృత్ నామ సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని గ్రామ దేవత ఊడరమ్మ, పోచమ్మతల్లికి నైవేద్యం సమర్పించారు. స్థానిక సాయిబాబా ఆలయం, రామాలయయలో పచ్చడి పంచి పెట్టారు. మల్లికార్జునస్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ వారు పంచాంగ శ్రవణం వినిపించారు.
మరికల్ మండలంలో…
ఉగాది పర్వదినం సందర్భంగా మండలకేంద్రంలో శనివారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో వేదపండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఏడాది వర్షాలు ఎక్కువగా ఉంటాయని, రైతులకు మంచిగా ఉంటుందని పండితులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్, పేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు సుజాత, గోపాల్‌తోపాటు అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.