శ్రీశైలం, ఏప్రిల్ 2 : శుభకృత్ నామ సంవత్సర ఉ గాది పర్వదినం సందర్భంగా శ్రీశైల క్షేత్రం జన సందోహంగా మారింది. శనివారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక, వేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాలతో అశేష జనవాహిని మ ధ్య రథోత్సవం వైభవంగా సాగింది. ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకొచ్చి సాత్వికబలి సమర్పించారు. రథోత్సవాన్ని వీక్షించేందుకు రెండ్రోజులుగా వివిధ రా ష్ర్టాల నుంచి వచ్చిన లక్ష మందికి పైగా వేచి ఉన్నారు. రథోత్సవంలో వివిధ కళారూపాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శనివారం రాత్రి శ్రీరమావాణి సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో భ్రమరాంబదేవి భక్తులను కటాక్షించింది. అలంకార మండపంలో మహాసంకల్పాన్ని ప ఠించి షోడశోపచార పూజలు నిర్వహించారు. చతుర్భుజాలు కలిగిన అమ్మవారు పాశం, అంకుశం, పద్మం, చె రుకుగడలతో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు.