అచ్చంపేట, మార్చి 29 : తెలంగాణలో మరో 20 ఏండ్లపాటు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నా రు. మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో ని ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యలు, గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు తెలియజేసిన సమస్యలను ప్రణాళికబద్ధంగా ఆయా గ్రామాలకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్ర భుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడడం లేదన్నారు. దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పా రు. మొదటి విడుతలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. నియోజకవర్గంలో రెండు వేల మందికి అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల జాబి తా అందజేయాలని ఆదేశించారు. నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు.
స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోని వారికి రూ.3 లక్షలు అందిస్తామన్నారు. కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్యలున్నా మండలస్థాయి నాయకులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. కేంద్రం ప్రదర్శిస్తున్న వ్యతిరేక వైఖరిని ఎండగట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు, విమర్శలు చేసినా అచ్చంపేట, రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. ప్రజలకు ఎలాంటి పథకాలు అవసరమో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి గుంటకు సాగునీ రు అందించే బాధ్యత తనదే అన్నారు. తవరలో ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేటలో పర్యటించనున్నట్లు విప్ గువ్వల తెలిపారు. అచ్చంపేటకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నల్లమల ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉం దని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయడమే ఆయన లక్ష్యమన్నారు. కేసీఆర్ జాతీయ రా జకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు ఆశీస్తున్నారన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, విండో చైర్మన్ భూపాల్‌రావు, చంద్రశేఖర్, గోపాల్‌రెడ్డి, బాల్‌రాజు, బాలు, బాలయ్య, నాగయ్యగౌడ్, శంకర్‌నాయక్, వసూరాం, పాండు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.