ధన్వాడ, మార్చి 28 : రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. తీర్మానాలను కేంద్రాలకు పంపాలన్న నిర్ణయం మేరకు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సభ్యులు తీర్మానం చేస్తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నా యకులు బీజేపీ నేతల వ్యవహారతీరును తిప్పికొడుతూ ఎం పీడీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టా రు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. బీ జేపీ నాయకులు రైతులపై చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తుంటే బీ జేపీ నాయకులు అడ్డుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు, ధన్వాడ సర్పంచ్ అమరేందర్‌రెడ్డి ఆరోపించారు. అనంతరం వైస్‌ఎంపీపీ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం లో కేంద్రమే వరి కొనుగోలు చేయాలని తీర్మానం చేయాల ని టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి డిమాండ్ చే శారు. దీనిని ఎంపీపీ పద్మీబాయి తిరస్కరించడంతో సభను బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోరం లేకుండా సభ వాయిదా వేయకుం డా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని, విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నారాయణరె డ్డి, మాధవరెడ్డి, గోవింద్ నాయక్, ఎంపీటీసీ కడపయ్య, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తదితరు లు పాల్గ్గొన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ తీర్మానాలు
ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని సభ్యులు తీర్మానం చేసి తీ ర్మాన ప్రతులను కేంద్రానికి పంపారు. ఆదేవిధంగా మా ర్కెట్ కమిటీలో కమిటీ సభ్యులు కేంద్రం వడ్లు కొనాలని తీర్మానం చేసి పంపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుకర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, వైస్‌చైర్మన్ ప్రస ద్ తదితరులు పాల్గొన్నారు.