భూత్పూర్, మార్చి 26 : వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభు త్వం ద్వంద్వనీతి పాటించడం సరికాదని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం లో శనివారం ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పం జాబ్‌లో పండించిన పంటను వందశాతం కొనుగోలు చేస్తు న్న కేంద్రం.. తెలంగాణలో పండిన పంటను కొనుగోలు చే యకపోవడం దారుణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమో దీ ద్వంద్వనీతి పాటించి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయడం సరికాదన్నారు. సమావేశంలో ఎంపీడీవో మున్ని, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, ఎం పీటీసీలు సాయిలు, రజిత, నిర్మలామాధవరెడ్డి, పద్మమ్మ, పుల్లయ్య, రమణి, కోఆప్షన్ సభ్యుడు ఖాజ ఉన్నారు.
మున్సిపాలిటీలో తీర్మానం..
కేంద్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలని భూ త్పూర్ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ కెంద్యాల శ్రీనివాసులు, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, వసంత, కోఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, అమ్రీన్, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం మొండివైఖరి వీడాలి
కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడి వడ్లను కొనుగోలు చేయాలని ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి అన్నారు. వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి తీర్మానం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయానికి తీర్మానాలను పంపనున్నట్లు తెలిపారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.
దేవరకద్ర మండలంలో..
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మండలంలోని గుడిబండ, జీన్గురాల తదితర గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎద్దుల జ్యోతి, శ్యాం సుందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపడం సరికాదన్నారు. వడ్లను కొనుగోలు చే యకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అడ్డాకుల మండలంలో..
మండలంలోని కాటవరం, తిమ్మాయిపల్లితండా గ్రామపంచాయతీల్లో గ్రా మసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మే ధాన్యం కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు భాగ్యలక్ష్మీరాజునాయక్, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.