ఊట్కూర్, మార్చి 26 : ప్రజా సంక్షేమం కోసం ప్రభు త్వం చేపట్టిన పథకాలు యావత్ దేశానికే ఆదర్శనీయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నపొర్ల, ఓబ్లాపూర్, కొల్లూర్, పు లిమామిడి, సంస్థాపూర్, పగిడిమర్రి, వల్లంపల్లి, నిడుగుర్తి తదితర గ్రామాల్లో శనివారం పర్యటించి స్థానిక అధికారు లు, ప్రజాప్రతినిధులతో కలిసి 192 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ సహాయం తో ఎంతో మంది పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్ల్లకు సాయం అందిస్తున్నామన్నారు.
వచ్చే నెల నుంచి ప్రభుత్వ పథకాల పంపిణీ
ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్ అందిస్తుందని కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చిట్టెం ప్రజలకు హామీ ఇచ్చా రు. ఆసరా పింఛన్లు, దళితబంధు, రే షన్ కార్డులు, ఇండ్లు లేని పేద కుటుంబాలకు రూ.3లక్షలతో ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రా రంభిస్తామని ఆయన తెలిపారు. ప్రభు త్వ పథకాలకు అర్హులైన వారిని నిజాయితీగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. పథకాలు పారదర్శకంగా అమలయ్యేందుకు ప్రతి నెలా స్వయంగా గ్రామాలను సందర్శిస్తానన్నారు. తమరి ఇంటికీ వస్తే మీరిచ్చే ఛాయ్, నీళ్లు మాత్రమే చాలన్నారు. ప్రభుత్వ పథకాలకు లంచం ఆశిస్తే ఎంతటి వారినైనా సహించమని హెచ్చరించారు. దళితబంధును గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాడి పరిశ్రమ, డైయి రీ చిల్లింగ్తో యువతకు మంచి ఉపాధి లభిస్తుందన్నారు.
పారిశుధ్యం మెరుగుపడాలి..
గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడి పల్లెలు స్వచ్ఛందం గా మెరవాలని, అందుకు ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాభివృద్ధిపై నిర్ల క్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించా రు. గ్రామాల అభివృద్ధికి నిధులెన్నయినా ఖర్చు చేస్తామని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సర్పంచులను ఆదేశించారు.
మరమ్మతు పనులు ప్రారంభం..
మండలంలోని చిన్నపొర్ల ఊర చెరువు, ఎర్రగుంట చె రువుల మరమ్మతు పనులను ఎమ్మెల్యే పూజ చేసి ప్రారంభించారు. రూ.31లక్షలతో చెరువు మరమ్మతు పనులను పూర్తి చేసి వానకాలం సీజన్ నాటికి రైతుల ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. చెరువు కట్ట మరమ్మతు, పాటు కాల్వల నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులు ఎమ్మెల్యే కృషిని కొనియాడారు. కా ర్యక్రమంలో తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కాళప్ప, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమా ర్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మీడియా సెల్ కన్వీనర్ నేతాజీరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.