అచ్చంపేట, మార్చి 26 : తెలంగాణ రైతులు, ప్రజలను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గో యల్ అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షు డు గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. శనివారం అచ్చంపేటలోని షామ్స్ ఫంక్షన్హాల్లో ఉప్పునుంత ల, బల్మూర్ మండలాల కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడు తూ రాష్ట్రంలో పండిన ధాన్యం కొనమని మంత్రులు అడిగితే బియ్యం తింటున్న ప్రజలను పారాబాయిల్డ్ తి నమని, నూకలు తినాలంటూ ఉచిత సలహాలు ఇ వ్వడం.. అనాగరిక మాటలు ప్రజల మనోభావాలు దె బ్బతీసేలా ఉన్నాయన్నారు. వరిని కొనేందుకు నిరాకరిస్తున్న కేంద్రంపై తెలంగాణ యుద్ధం ప్రకటించిందన్నా రు. అన్ని స్థాయిలో ఒత్తిడి తెచ్చి మోదీ సర్కార్ దిగొచ్చే వరకు పోరాటాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని పిలపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రజల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసర గా వరుసగా పోరాటాలు నిర్వహించేందుకు పార్టీశ్రేణు లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండలాలు, గ్రామాల్లో పార్టీశ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు. ఇప్పటికే అన్ని రకాల ధరలు, నిత్యావసర ధరలు పెంచి మహిళలకు విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. మరో ఇరవై ఏండ్ల పాటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే ఇతర పార్టీలు లేవన్నారు. రానున్న ఎన్నికల్లో దాదాపు 100 సీట్లకుపై గా గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో సీఎం కేసీఆర్ అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు. సాగునీటి పథకాలకు శంకుస్థాపనతోపాటు వంద పడకల దవాఖాన ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా అచ్చంపేటలో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. దళితబంధు పథకం అర్హులైన పేదలకు అందించేందుకు వివరాలు అందించాలని అ న్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్తకర్తలు పాల్గొన్నారు.