మహబూబ్‌నగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రైతులపై కేంద్రం ఆది నుంచే నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. ధాన్యం కొ నుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వి జ్ఞప్తి చేసినా.. కేంద్రం తీరు మాత్రం మారడం లే దు. తెలంగాణపై చిన్న చూపు చూస్తూనే ఉన్నది. ‘ఎందుకు ఊరికే ఢిల్లీకి వస్తారు.. మీకేం పనులు లే వా’ అంటూ గతంలో మంత్రులను అవమానించి న కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీరులో ఇప్పటికీ మార్పేం కనిపించడం లేదు. గురువారం గోయల్‌ను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి బృందం వి జ్ఞప్తి చేసినా.. పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనుగోలుకు అంగీకరించకపోగా.. అన్నదాతలను కేం ద్ర మంత్రి అవమానించడంపై రైతాంగం భగ్గుమంటున్నది. యాసంగిలో పండే ధాన్యం రా రైస్ ఇచ్చే పరిస్థితి లేనందునే బాయిల్డ్ రైస్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. యాసంగి ధాన్యాన్ని రా రైస్ ఆడిస్తే నూకలు వస్తాయంటే.. ఆ నూకలను మీ ప్రజలకు పంపిణీ చే యండని సాక్షాత్తు కేంద్ర మంత్రే వ్యాఖ్యానిచండం పై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆయన నిరంకుశత్వానికి, తలబిరుసుకు, తెలంగాణ ప్రజలపై కేంద్రానికి ఉన్న నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. బాయిల్డ్ రైస్ తీసుకోనం టూ మొండికేయడమే కాకుండా కనీసం ధాన్యం కొనుగోలుకు కూడా అంగీకరించకపోవడమంటే తెలంగాణపై కేంద్రం విషం చిమ్ముతున్నట్లే భావించాల్సి వస్తుందని అన్నదాతలు అంటున్నారు. పం జాబ్‌లో రెండు పంటలు కొనుగోలు చేస్తున్న కేం ద్రం తెలంగాణ విషయానికి వచ్చే సారికి రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గోయల్ తీరు ఘోరంగా ఉందంటూ పేర్కొంటున్నారు.
పాత పరిస్థితి రావాలనుకుంటున్న కేంద్రం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రేషన్ బియ్యం పరిస్థితి దారుణంగా ఉండేది. నూకలు, పురుగుల బియ్యం సరఫరా అయ్యేది. పంజాబ్ నుంచి వచ్చిన బియ్యం ఏ మాత్రం నాణ్యత లే కుండా ఉండేది. అలాంటి బియ్యం తిన్న అనుభవమున్న తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఆడించి న తర్వాత వచ్చిన నాణ్యమైన బియ్యాన్నే ప్రభు త్వం పంపిణీ చేస్తున్నది. ఈ తరుణంలో యాసంగి బియ్యాన్ని మర ఆడించి వచ్చిన నూకల బియ్యా న్ని మీ ప్రజలకు తినడం అలవాటు చేయండని కేం ద్ర మంత్రే అనడం చూస్తే వారి అహంకారం ఏం టో అర్థమవుతున్నదని ఒకప్పుడు నూకల బి య్యం తిన్న వృద్ధులు అంటున్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితి రావాలని కేంద్రం కోరుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నదని పలువురు చెబుతున్నారు. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంటూ రాష్ర్టానికి న్యాయం చేయాల్సిందిపోయి అ న్యాయం చేస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. అ న్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన చోట ఒకలా.. నచ్చని చోట మరోలా చూస్తున్నది.
కేంద్రం తీరుతో అన్నదాతల ఆందోళన..
తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి రంగం బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బీళ్లన్నీ సాగు భూములుగా మారాయి. రైతులు బంగారు పంటలు పండించుకుంటున్నారు. ఈ తరుణంలో కేంద్రం ధాన్యం కొ నుగోలుకు కొర్రీలు పెట్టడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో నీళ్లు, కరెంటు లేక పంటలు పండించుకోలేదని.. ఇప్పుడేమో కేం ద్రం తీరు చూస్తే ఆందోళన కలుగుతున్నదని అన్నదాతలు అంటున్నారు. కేంద్రం విధానాలు రైతును బాగు చేసేలా ఉండాలని రైతును, వ్యవసాయాన్ని ఆగం చేసేలా ఉండకూడదని అన్నదాతలు పేర్కొంటున్నారు. కేంద్రం రాజకీయాలకు రైతులను బలి చేయకూడదని హితవు పలుకుతున్నారు.
రైతులను అవమానిస్తున్నారు..
ధాన్యం కొనుగోలు విషయంలో పూట కో మాట మాట్లాడుతున్న కేంద్రం తమ వైఖరి మార్చుకోవాలి. వడ్లను కొనమని చె ప్పడం రైతులను, పంటను అవమానించే లా ఉన్నది. సీఎం కేసీఆర్ సర్కార్ వచ్చాక నీళ్లు, కరెంటు, పెట్టుబడి అందించడంతో వ్యవసాయం పండుగలా మారింది. పంట లు పుష్కలంగా పండుతున్నాయి. వలసలు లేకుండా పోయాయి. సొంత ఊర్లలో ఉపాధి దొరుకుతుండడంతో సంతోషంగా ఉన్నాం. రైతులకు ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. రైతాంగమంతా కేసీఆర్ సర్కార్‌కు రుణపడి ఉంటుంది. కేంద్రం తీరు మార్చుకోవాలి. లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– రాములు, రైతు, పొల్కెపహాడ్, గోపాల్పేట మండలం
ప్రతి గింజనూ కొనాలె..
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాలె. రా రైస్ మాత్రమే కొంటామనడం రైతులను మోసం చేయడమే. గతంలో అన్ని రకాల వడ్లు కొనుగోలు చేసిన కేంద్రం ఇప్పుడు ఎందుకు కొనడం లేదు. మోసపూరిత కేంద్రానికి రైతులు తగిన గుణపాఠం చెబుతారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదు.
– కృష్ణారెడ్డి, రైతు, అప్పంపల్లి, మరికల్ మండలం
రైతులపై వివక్ష తగదు..
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వడ్లు కొనమంటూ రైతులపై కక్ష కట్టి చేతులెత్తేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కేంద్రం రైతుల నడ్డి విరుస్తున్నది. వడ్లు కొనే వరకూ ఉద్యమాలు చేస్తాం. రైతుల ఉసురు కేంద్రానికి తగులుతుంది.
– కొండారెడ్డి, రైతు, మరికల్ గ్రామం
సీఎం పుణ్యాన సన్నబువ్వ తింటున్నం..
మా చిన్నతనంలో నూకల బియ్యం, అంబలి తాగి బతినం. సీఎం కేసీఆర్ పుణ్యాన గిప్పుడు సన్నబువ్వ తింటున్నం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమంటున్నది. గిట్ల అయితే బియ్యం జనాలకు ఏడికెళ్లి తెచ్చి ఇస్తరు..? మళ్లీ నూకల బియ్యం తినే పొద్దు వస్తదేమో. వడ్లు కొనకపోతే రైతులు ఎట్లా అమ్ముకోవాలి..
– వెంకటప్ప, కర్ని గ్రామం, మక్తల్ మండలం
కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతాం..
కేంద్రం నిరంకుశపాలన చేస్తున్నది. తాను చెప్పిందే వేదమని.., అదే జరగాలని శాసనాలు చేస్తే ఉరుకోం. రైతే రాజు అన్న నానుడి కేంద్రం మరిచింది. రైతులకు మేలు చేసే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ధాన్యం కొనుగోలు చేసే వరకూ పోరాటాలు చేస్తాం. రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్ ఇలా అనేక పథకాలతో రైతును రాజును చేశారు.
– మహరాజ్ యాదవ్, జూలేకల్, వడ్డేపల్లి మండలం
నూకల బువ్వ తినమంటే ఎట్లా..
మా చిన్నతనంలో బియ్యం, నూకల బు వ్వ తినేటోళ్లం. రానురానూ అన్నీ అనుకూలమై బియ్యంతో వండిన బువ్వ తినడానికి అలవాటుపడ్డాం. ఇప్పుడు నూకల బువ్వ తినేందుకు పిల్లలు కూడా ఇష్టపడరు. మా కు కూడా అలవాటు తప్పింది. ఢిల్లీ గవర్నమెంట్ ప్రజలను నూకల బువ్వ తినమంటే ఎట్లా. అలా మాట్లాడడం బాధ కలిగిస్తున్నది. కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి.
– అంబ్రమ్మ, గుడెబల్లూర్ గ్రామం, కృష్ణ మండలం