కోయిలకొండ, మార్చి 25 : తెలంగాణ లో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని శుక్రవారం కోయిలకొండ గ్రామపంచాయతీలో తీర్మానం చేశా రు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య మాట్లాడు తూ తెలంగాణ రైతుపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. వడ్లను కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చే యాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మండలంలోని 44 గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేసి ఎమ్మెల్యే రా జేందర్‌రెడ్డి ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పంపనున్నట్లు తెలిపారు.
రాజాపూర్ మండలంలో..
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని రాజాపూర్ గ్రామపంచాయతీలో తీర్మా నం చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేయకపోతే బీజేపీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
అడ్డాకుల మండలంలో..
మండలంలోని కందూరు, తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీల్లో యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తీ ర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీకాంత్, ఆంజనేయులు, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని మండలంలోని 45 గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా తీర్మానా లు చేశారు. రైతుల సమక్షంలో తీర్మానాలు చేసి పోస్టు ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పంపించారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, మమ త, హైమావతి, రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, శ్రీనివాసులుయాదవ్, గంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.