మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 25 : నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం వాటరింగ్డే సందర్భంగా అప్పన్నపల్లి బ్రిడ్జిపై మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం మొక్కలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరందించాలని సూచించా రు. అదేవిధంగా బృందావన్‌కాలనీ నర్సరీలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ మొక్కలకు నీరు పోశారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
వేసవిలో మొక్కలు ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని బొవెలకుంట శ్రీనగర్‌కాలనీ ప్రకృతివనాన్ని పరిశీలించి మొక్కలకు నీరు పోశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని కోరారు. ప్రకృతివనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవా, బుక్క మహేశ్, నాయకులు కృష్ణారెడ్డి, రాము పాల్గొన్నారు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో జయరాం సూచించారు. మండలకేంద్రంలో మొక్కలను పరిశీలించి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించి కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బీ.కృష్ణయ్య, సూపరింటెండెంట్ హరీశ్‌రెడ్డి, ఎంపీవో నసీర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నర్సరీ పరిశీలన
మండలంలోని నందారంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఎంపీవో శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సరీ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంపీవో వెంట ఏపీవో రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండలంలోని రాణిపేట, మంగళిగడ్డతండాల్లో నర్సరీలను ఎంపీడీవో సాయిలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీవో అనురాధ తదితరులు పాల్గొన్నారు.