మాగనూర్, మార్చి 25 : కరోనా సమయంలో ఆశ వ ర్కర్లు ఎనలేని సేవలు చేశారని, ప్రాణాలను సైతం లెక్క చే యకుండా సేవలు చేయడం హర్షణీయమని, వారి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కొనియాడారు. మాగనూర్ ప్రభుత్వ దవాఖానలో మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాల ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను శుక్రవా రం పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మె ల్యే చిట్టెం, డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తున్న ప్రభుత్వం, పల్లె ప్రజల కు సైతం మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. గ్రామాల్లో వివిధ వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి చికిత్స అందించేందుకు సర్కారు ఆన్ లైన్ సేవలను అమలు చేస్తున్నదన్నారు. అందు కోసం ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిందన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లతో ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వైద్యారోగ్యశాఖ సమాచారం తెలుసుకునే అవకాశం ఏ ర్పడిందని, ఆన్లైన్లో వివరాలు న మోదు చేయనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమలో సర్పంచ్ రాజు, జెడ్పీటీ సీ వెంకటయ్య టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు ఎల్లారెడ్డి, మండల వైద్యాధికా రి తిరుపతి, మేడికల్ అధికారి డాక్టర్ సిద్ధప్ప, వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదల పక్షపాతి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది. మారుమూల ప్రాంతమైన మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈక్రమంలోనే మండలానికి దాదాపు రూ. 2 కోట్ల విలువ గల 190 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూ రు చేయించడమే కాకుండా ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఇంటికీ ఎమ్మెల్యే వెళ్లి శుక్రవారం పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపడుచుల కండ్లల్లో ఆనందమే సమాజానికి శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజలు వారి వారి విజ్ఞప్తులను ఎమ్మెల్యేకు విన్నవించగా అక్కడి నుంచే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
స్మార్ట్ఫోన్లు పంపిణీ
మండలంలో విధులు నిర్వహిస్తున్న 43 మంది ఆశ వ ర్కర్లకు ఎమ్మెల్యే చిట్టెం స్మార్ట్ఫోన్లు అందజేశారు. దవాఖా న ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ కరోనా కాలంలో గ్రామాల్లో ఆశ వర్కర్లు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, విండో వైస్‌చైర్మన్ లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.