తొర్రూర్ : తెలంగాణ అంతటా ఇవాళ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజారిటీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నిక సజావుగా సాగుతోంది. కానీ హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆయా మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్నారు.
ఈ క్రమంలో పలు మున్సిపాలిటీల్లో ఘర్షణలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చినా ఎక్స్అఫిషియో మెంబర్ల ఓట్లతో బలాలు సమానం అయ్యాయి. దాంతో ఇక్కడ డ్రా తీసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు భారీ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తమై రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యాలయానికి చేరుకోగా.. ఎర్రబెల్లి పీఏపై కొంతమంది కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు.
తొర్రూర్ మున్సిపాలిటీలో ఓటమిని జీర్ణించుకోలేక
అధికార మదం, పోలీసుల అండతో దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ గూండాలు!తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ గూండాల దాడి.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అక్రమంగా నిర్బంధించిన… pic.twitter.com/JQo0Er162M
— BRS Party (@BRSparty) February 16, 2026
తొర్రూర్‌లో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ ఎక్స్అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్ మద్దతుదారులు కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా మారాయి. దాంతో డ్రా ద్వారా ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదిలావుంటే వరంగల్‌లో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా కావ్య పేరు ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని ఆ పార్టీ చెబుతోంది. ఇదిలావుంటే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకునేందకు రాగా.. అధికారులు అడ్డుకున్నారు.
రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న ప్రాంతంలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఆయనను ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అనుమతించలేదు. దాంతో ఆయన ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని చెప్పారు.