చారకొండ, మార్చి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులకు గొప్పవరం లాంటిదని విప్, ఎమ్మెల్యే గువ్వల బా లరాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సాయి తిరుమల ఫంక్షన్హాల్లో దళితబంధు పథకంపై సర్పంచ్ విజేందర్‌గౌడ్ అధ్యక్షతన దళితులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా విప్ గువ్వల, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఉదయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ దళిత సామాజిక వర్గం ఆర్థిక పురిపుష్టి సాధించి, ఆత్మగౌరవం తో బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టులో చారకొండ మండలం ఎంపిక చేసినట్లు చెప్పారు. గతంలో పాలించిన పార్టీలు దళితుల ఓట్లు దండుకున్నాయే తప్పా కనీసం వారి బాగోగులు ఏమాత్రం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
దళితబంధులో మంచి యూనిట్లను ఎంపిక చేసుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. ప్రతి కుటుంబానికి దళితబంధు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా, దళారీగా వ్యవహరించిన, డబ్బులు పక్కదారి పట్టించిన వా రిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తా ను కూడా వలస కూలీ బిడ్డగా ఉండి వ్యాపారం చే స్తూ ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. కలెక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ మండలంలో 13 గ్రా మాల్లో ఇప్పటి వరకు 1,580 మంది లబ్ధిదారులు యూనిట్లు ఎంపిక చేసినట్లు తెలిపారు. మొదటి విడుతగా డెయిరీ, మినీడెయిరీ వంటి యూనిట్ల షెడ్లు నిర్మాణానికి వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యను విప్, కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్ అభినందించారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎంపీపీ నిర్మలా విజేందర్‌గౌడ్, సింగిల్ విండో చై ర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు సమితి మం డలాధ్యక్షుడు గజ్జెయాదయ్య, తాసిల్దార్ నాగమ ణి, ఎంపీడీవో జయసుధ, ఎంపీవో నారాయణ, దళితబంధు ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.