కల్వకుర్తి, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు న్న విధానాలతో దేశ ప్రజలు అరిగోస పడుతున్నారని, ప్ర జాకంఠకంగా మారిన మోదీ సర్కార్‌కు చరమగీతం పాడుదామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయకుండా రైతులపై వివక్ష చూపుతున్న కేంద్రం తీరును ఎండగట్టేందుకు శుక్రవారం కల్వకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృ ద్ధి చెందుతుంటే ఓర్వలేని కేంద్రం, రాష్ట్ర ప్ర భుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పండిన వరిని కొ నుగోలు చేయమని చెబుతున్నదని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలను పెంచి పేద, మధ్య తరగతి వారిపై మోయలేని భారం మెపిందన్నారు. ఇక్కడ పండిన ధా న్యం కొనుగోలు చేయాలని, ఇచ్చిన హామీల ను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏ కగ్రీవ తీర్మానాలు చేసి పీఎం మోదీకి పంపించాలని సూచించారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కలిగించేలా గ్రామగ్రామానా సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై పాటలతో సాయిచంద్ ఉత్తేజపరిచారు. సమావేశంలో కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ విజితారెడ్డి, భరత్‌ప్రసాద్, అనురాధ, కల్వకుర్తి ఇన్చార్జి ఎంపీపీ గోవర్ధన్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్, సర్పంచ్ భూపతిరెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, మధు, ఈశ్వరయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.