అయిజ, మార్చి 25 : నడిగడ్డ జన నేతకు కన్నీటి వీ డ్కోలు లభించింది. టీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నేత పులకుర్తి తిరుమల్‌రెడ్డి అంత్యక్రియలకు శుక్రవారం శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, నాయకులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు అయిజ మండలం ఉ త్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆయ న పార్థివదేహానికి పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామస్తులు, ఆత్మీయులు, టీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఉత్తనూరులోని పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడం కోసం సొంతంగా 6 ఎకరాల భూమి ఇచ్చి దాతృత్వాన్ని చాటుకోవడంతో స్థానిక పాఠశాల విద్యార్థులు తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. సకల హంగులతో రైతు వేదిక, ఆలయ పునర్నిర్మాణం, పంచాయతీ భవనం, జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు బాస్కెట్‌బాల్ కోర్టు వంటి సౌకర్యాలు కల్పించడం తిరుమల్రెడ్డికే సాధ్యమైందని స్థానికులు ఆయన సేవలను స్మరించుకున్నారు.
తిరుమల్‌రెడ్డి అంత్యక్రియల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, మా జీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, సంపత్‌కుమార్, నాయకురాలు బంగారు శృతి పాల్గొన్నారు. తిరుమల్‌రెడ్డి తనయుడు గౌతంరెడ్డి, సతీమణి సువర్ణమ్మ, కు టుంబ సభ్యులను వారు పరామర్శించి అండగా ఉం టామని ధైర్యం చెప్పారు. అనంతరం అంతిమ యాత్ర లో తిరుమల్‌రెడ్డి పాడెను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల, అబ్రహం మోశారు. అంతకుముందు ఉత్తనూర్ వాసులు తిరుమల్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తిరుమల్‌రెడ్డి మృతి చెందిన నాటి నుంచి అంత్యక్రియలు జరిగే వరకు ఎమ్మెల్యే బండ్ల అన్నీతానై వ్యవహరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం, పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ చైర్మన్ బం డారి భాస్కర్, వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యో తి, గద్వాల బీఎస్ కేశవ్, టీఆర్ఎస్ అలంపూర్ నియోజకవర్గ నేతలు సుందర్రాజు, మంద శ్రీనాథ్, నాయకులు తిరుపతయ్య, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, యు వనేత అజయ్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, విండో మాజీ చైర్మ న్ రాముడు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు ర ఘునాథ్రెడ్డి, మహబూబ్ పాషా, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.