పెద్ద మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఒకేసారి 81 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. దీంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని చెప్పారు.
వనపర్తి, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. శుక్రవారం వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూపు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నూతన జోనల్ వ్యవస్థకు ఆమోదం తీసుకొచ్చారని గుర్తు చేశారు. తొలిసారి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించనున్నట్లు తెలిపారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు అనగానే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అభ్యర్థులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తాయని, అదే వారి వ్యాపకం అని అన్నారు. ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు లేనప్పుడు సహజంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించక తప్పదన్నారు. గతంలో ప్రైవేట్ శిక్షణా కేంద్రాలు పెడితే అభ్యర్థుల మీద ఎక్కువ భారం పడకూడదని కొన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రూపు -1 మొదలుకుని గ్రూపు-2, గ్రూపు-3, 4 వరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ మంత్రులతో మాట్లాడి వనపర్తిలో ప్రభుత్వ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఒప్పించినట్లు తెలిపారు. నిరుద్యోగులు ప్రభుత్వ కోచింగ్ సెంటర్లను వినియోగించుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు రాము, విద్యార్థులు పాల్గొన్నారు.
వనపర్తి, ఏప్రిల్ 29 : బంగారు తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని చెప్పారు. శుక్రవారం శ్రీనివాసపు రం బిజినగడ్డతండాకు చెందిన దాదాపు 30 మంది వెంకటేశ్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయ ఆవరణలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం పక్కా ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పా ర్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.