మహబూబ్‌నగర్, జూలై 20 : స్వరాష్ట్రం లో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. బుధవారం మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అధ్యక్షతన సర్వస భ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ రాష్ట్రంలో 10 గ్రామాలకు స్వచ్ఛ అవార్డులు వచ్చాయన్నారు. రైతులు వరికి బదు లు ఆదాయం సమకూరే పంటలను పండి స్తే మేలు జరుగుతుందన్నారు. ఆయిల్‌పాం, కూరగాయల సాగు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో గ్రామాలు అ ద్భుతంగా తీర్చిదిద్దుకున్నాయన్నారు. పట్టణాలకు పరిమితమైన చెత్త సేకరణతోపాటు తాగునీరు సైతం గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందించామన్నారు. నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు పునరాలోచిస్తామన్నారు. ఖాళీ గా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేస్తామన్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఉంటే ఆర్హులైన వారికి డబ్బులిస్తామన్నారు. అవసరమైన విధివిధానాలు త్వరలో వెలువడతాయని స్పష్టం చేశారు. పాల ధరలపై జీఎస్టీ విధించడం సరికాదని మహబూబ్‌నగర్ జె డ్పీ పాలకవర్గం తీర్మానించింది. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు వెసులుబాటు కల్పించాలన్నారు.
గ్రామ, మండల స్థాయిలో ని ర్వహించే సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. డి సెంబర్ నాటికి 70 శాతానికి పైగా డబుల్‌బె డ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ఎ గ్జిక్యూటివ్ ఇంజినీర్ భాస్కర్‌ను ఆదేశించా రు. ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులకు డీసీసీబీ ద్వారా రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయిల్‌పాం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ప్రతి ఏడాది వచ్చిన నిధులు, ఖర్చు, చేపట్టే పనులపై పూర్తిస్థాయిలో నివేదిక ఇ వ్వాలని డీఎఫ్‌వో గంగారెడ్డిని ఆదేశించారు. ఫత్తేపూర్ మైసమ్మ ఆలయంలో షెడ్ల నిర్మాణానికి వారం రోజుల్లో స్థలం కేటాయించాలన్నారు. ఫైల్ సర్క్యూలేషన్ పేరుతో జా ప్యం చేయొద్దని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ న రేందర్‌ను ఆదేశించారు. ఉపాధి హామీ ప థకం ద్వారా పాఠశాలలో పరిశుభ్రత కోసం ఇద్దరిని ఏర్పాటు చేసేందుకు తీర్మానించా రు. ఈ అంశాన్ని మూసాపేట జెడ్పీటీసీ ఇం ద్రయ్యసాగర్ ప్రతిపాదించగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. ఈ విషయాన్ని వారం రోజుల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతామన్నారు. రైతుబీమా పారదర్శకత కోసం ఒక అధికారిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 600 మందికి రైతుబీమా అందిందని, మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని వివరించారు. ప్ర త్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి 149 మంది రైతు కుటుంబాలకు ఇన్సూరెన్స్ డ బ్బులందించేలా చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. 86 రైతువేదికల్లో టీవీ, ఎల్ఈడీ బల్బులు ఏ ర్పాటు చేసేందుకు దాతలు ముందు కు రావాలని కో రారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడు తూ జిల్లాలోని ప్ర తి సమస్యనూ పరిగణలోకి తీసుకుంటూ మరింత అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రగతిని సాధించుకుందామని పి లుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రె డ్డి మాట్లాడుతూ జానంపేట, అమిస్తాపూర్ లో డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశామ ని, లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లారని, పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ముందుకు తీసుకుపోవాలని, ఇబ్బందులు లేకుండా అధికారులు చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఉదయం 9 గంటలకే ప్రారంభించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాచేస్తే ప్ర తి అంశంపై చర్చలు జరుగుతాయని, జిల్లా పరిధి కూడా తక్కువగా ఉండడంతో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స మావేశంలో కలెక్టర్ వెంకట్రావు, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీసీబీ అధ్యక్షుడు ని జాంపాషా, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షు డు రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జెడ్పీ సీఈవో జ్యోతి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు.