నల్లమలలో.. డయాలసిస్ కేంద్రం
నల్లమలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన 100పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి.
- దవాఖానలో కొనసాగుతున్న పనులు
- నిత్యం 16మందికి వైద్యసేవలు
- నాలుగు మిషన్లు ఏర్పాటు, ఒక్కో మిషన్‌పై నలుగురికి డయాలసిస్
అచ్చంపేట, డిసెంబర్ 20: నల్లమలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన 100పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రానికి మూడు గదులు కేటాయించారు. పరికరాల బిగింపు, విద్యుత్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. కిడ్ని వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవీ బాధితులకు వేర్వేరుగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషితో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నల్లమలలో పేదలు, గిరిజనులు, దళితులకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉండేందుకు ఆక్టోబర్‌లో డయాలసిస్ సెంటర్ మంజూరు చేశారు. అచ్చంపేటలో డయాలసిస్ కేంద్రంలేక హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌కు వెళ్లి చేయించుకుంటున్నారు.
దీంతో వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగి నెలలో అనేకసార్లు డయాలసిస్ చేయించుకోవడంతో వైద్యం, రవాణా ఖర్చుభారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటి వారికి అచ్చంపేటలో కొత్తగా మంజూరైన డయాలసిస్ సెంటర్ వరం లాంటిది. పేదలకు ఈ సెంటర్ ద్వారా ఉచిత సేవలు అందించనున్నారు. ఒక డయాలసిస్ మిషన్‌పై రోజుకు నలుగురు చొప్పున నాలుగు మిషన్లపై 16మంది డయాలసిస్ చేయంచుకునే అవకాశం ఉంది. అచ్చంపేట ప్రాంతంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు విప్ గువ్వల బాలరాజు దృష్టిసారించడంతో అధునాతనమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

