నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
నారాయణపే ట నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇం టికీ తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు.
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
- ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ప్రతి కార్యకర్త కుటుంబానికీ టీఆర్ఎస్ అండ
నారాయణపేట రూరల్, నవంబర్ 27 : నారాయణపే ట నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇం టికీ తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని జాలాల్పూర్ ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం మం డల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వి షయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సెంటు భూమికి సాగు నీరు అందించమే లక్ష్యమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కుటుంబానికీ టీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ప్రతి ఇంటిలో లబ్ధిదారులు ఉన్నారన్నారు. గ్రామాల్లో పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలీదేవి, సింగిల్విండో చైర్మన్ నర్సింహారెడ్డి, నా యకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

