మక్తల్ టౌన్, నవంబర్ 26 : తెలంగాణ ఏర్పడ్డాకే పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని టీచర్స్ కాలనీలో తెలంగాణ అర్బ న్ కార్పొరేషన్ డెవలప్మెంట్ నిధులు రూ.5 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనే జీ పనులను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో క లిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో అభివృద్ధి జరిగిందన్నారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉ న్న మక్తల్ నేడు మున్సిపాలిటీగా ఏర్పాటైందని తెలిపారు. అర్బన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ నిధులతో వివిధ పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం నిరంతరం ప్రజా శ్రేయస్కరం కోసం పనిచేసే వ్యక్తి అన్నారు. ని యోజకవర్గంలో మంచి పనులు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు.
మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్ మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ సహకారంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పేర్కొన్నారు. పట్టణంలోని 1, 4, 5, 6, 7, 9, 10, 12వ వార్డుల్లో రూ.5 కోట్లతో పనులు చేపట్టామన్నారు. త్వరలోనే మరో రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, టీఆర్ఎస్ సీనియర్ నేత దేవరి మల్లప్ప, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి, ఏఈ నాగశివ, కౌ న్సిలర్లు శ్వేత, సత్యనారాయణ, నర్సింహులు, రాములు, మొగులప్ప, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఉన్నారు.
కిన్నెర కళాకారుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన కిన్నెర కళాకారుడు రాముడు కు టుంబాన్ని ఆదుకుంటామని మంత్రి శ్రీ నివాస్‌గౌడ్, ఎమ్మెల్యే చిట్టెం భరోసానిచ్చారు. పట్టణంలో వివిధ పనులను ప్రా రంభించేందుకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాముడు దంపతులు కలిశా రు. పేదరికంలో ఉన్నామని, ఆదుకోవాలని ఏకరువు పెట్టారు. స్పందించిన మంత్రి, ఎమ్మెల్యే దళితబంధు పథకం లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.