నవాబ్‌పేట, నవంబర్ 25 : నాడు వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు నేడు వలసలు వా పస్ వచ్చే స్థాయికి చేరిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రుద్రారంలో సర్పంచ్ లలితమ్మ కృష్ణారెడ్డి ఇంట్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాల వల్లే దూర ప్రాంతాలకు వెళ్లిన వలసవాదులు సొంతూళ్లకు తిరిగి వస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకం వెలుగులు నింపుతున్నదని చెప్పారు. కులవృత్తులకు పూర్వవైభవం సంతరించుకుంటున్నదని చెప్పారు. పాలమూరులో పాలనా సౌలభ్యం కో సం.. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ని ర్మించినట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే ఎంవీఎస్ కళాశాల మైదానంలో లక్షా 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించన్నుట్లు స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి 25 వేల మందిని తరలించేలా చ ర్యలు తీసుకుంటామన్నారు. పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జి ల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎంపీపీ అ నంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ చందర్‌నాయక్, సర్పంచులు గోపాల్‌గౌడ్, యా దయ్య, వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.