ఊట్కూర్, నవంబర్ 25 : మక్తల్ నియోజకవర్గాన్ని ఆ దర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలో శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే శారు. మండలంలోని సంస్థాపూర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రా రంభించారు. మండలకేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 41మంది లబ్ధదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణ ప్రభుత్వంపై కక్షపూరింతగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీ జేపీ కుట్రల ఫలితంగా మంత్రుల ఇండ్లపై దాడులు కొనసా గుతున్నాయని మండిపడ్డారు. మోదీ, ఈడీలకు భయపడే ప్రసక్తి లేదని స్ప ష్టం చేశారు.
ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నదని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు దేశ ప్రజలు సి ద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సీ ఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అ ద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నా రు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్ర తిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమా ర్, సర్పంచ్ యశోద, ఎంపీటీసీ అనిత, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీడీవో కాళప్ప, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శించిన ఎమ్మెల్యే
ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో మండలంలోని వల్లంపల్లి గ్రామానికి చెందిన పలువురు కూలీలు గాయపడ్డారు. గ్రామానికి చెందిన 20 మందికి పైగా కూ లీలు మరికల్ మండలంలో పత్తి పనులకు వెళ్తుండగా ప్ర మాదవశాత్తు ఆటో బోల్తాపడినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన ఆనంద్, వర్ష, చెన్నమ్మ, గోవిందమ్మ, ఆనందమ్మలను చికిత్స కోసం బంధువులు జిల్లా దవాఖానలో చే ర్పించారు. కాగా, మండలంలోని అమీన్పూర్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే కార్యకర్తల నుంచి విషయం తెలుసుకొని జిల్లా దవాఖానకు చేరుకొని బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సై రాములు, స్థానికులు పాల్గొన్నారు.