హన్వాడ, నవంబర్ 20 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య అన్నారు. మండలంలోని కిష్టంపల్లిలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అం దించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. వానకాలం, యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడిసాయం అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
ఆరుగాలం కష్టిం చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సరస్వతి, రాములు, యాదగిరిరెడ్డి, గోపాల్‌రెడ్డి, పెంటయ్య, వెంకటయ్య ఉన్నారు.