Golmaal 5 | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘గోల్మాల్ 5’లో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో అసలైన విశేషం ఏమిటంటే, అక్షయ్ ఇందులో హీరోగా కాకుండా ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సాధారణంగా అక్షయ్ కుమార్ అంటే కామెడీ, యాక్షన్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్, కానీ రోహిత్ శెట్టి రూపొందించే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘గోల్మాల్’లో ఆయన విలనిజం పండించబోతున్నట్లు తెలుస్తుంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ వంటి గోల్మాల్గ్యాంగ్కు అక్షయ్ తన విలనిజంతో ఎలా చుక్కలు చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్షయ్ కుమార్‌కి గతంలో ‘అజన్బీ’, ‘రోబో 2.0’ వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించిన ట్రాక్ రికార్డ్ ఉంది, కాబట్టి ఈ కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలో ఆయన అజయ్ దేవగన్ గ్యాంగ్‌ను ఎలా ఢీకొంటారో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.