మరికల్, నవంబర్ 19: అంతర్రాష్ట్ర రహదారిపై ధన్వాడ మండలం ఎమినోనిపల్లి స్టేజీ సమీపంలో శనివారం రాత్రి 7:30 గంటలకు కారు, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మరికల్ సీఐ రాంలాల్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండలం మద్వార్ గ్రామానికి చెందిన భీంరాజ్ బొలెరో వాహనంలో పత్తిని విక్రయించడానికి రాయిచూర్ వెళ్లి తిరిగి మద్వార్కు వస్త్తుండగా, గున్ముక్ల గ్రామంలోని కడపరాయ స్వామిని దర్శించుకొని లింగుసూగూర్కు వెళ్తున్న ఎర్టిగా కారు ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
ఎర్టిగా కారులో లింగుసూగూర్ వెళ్తు న్న ఊట్కూర్ మండలం, తిప్రాస్‌పల్లి పంచాయతీలోని బాపు రం గ్రామానికి చెందిన ఆశిరెడ్డి (57) ఆక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాయిచూర్‌కు చెందిన సురేందర్‌రెడ్డి(48) దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరో ముగ్గురిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సీఐ తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారు కర్ణాటక రాష్ట్రం లింగుసూగూర్కు చెందినవారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ధన్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.