మరికల్, నవంబర్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ఆర్జేడీ విజయలక్ష్మి అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు టీఎల్ఎంను కచ్చితంగా పాటించాలని ఉపాధ్యాయులకు సూచిచారు. బుధవారం మరికల్లోని బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడారు. అలాగే ధన్వాడలోని సంతబజార్ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు స్పీడ్ రీడింగ్ చేయించాలని, నిర్ధేశిత సమయంలో ఎఫ్ఎల్ఎన్ లో విద్యార్థుల ప్రగతి పెంచి డిసెంబర్లోగా ప్రతి విద్యార్థి వందశాతం సామర్థ్యాలు సాధించాలన్నారు. ధన్వాడలోని సంతబజార్ పాఠశాలలో ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎంను పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా మరికల్లోని బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రతగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, సీఎంవో శ్రీనివాసులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.