Manoj bajpayee Pandat Contraversy | ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ తన చిత్రం ‘పండిట్’ (Pandat) టైటిల్ వివాదంపై తాజాగా స్పందించారు. ఈ సినిమా టైటిల్ పండిట్ అనే పదం ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదంపై దర్శకుడు నీరజ్ పాండే స్పందిస్తూ.. ప్రచార చిత్రాల (Promotional Materials) తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తాజాగా నీరజ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మనోజ్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. మనం భాగమైన ఒక విషయం కొంతమందిని బాధపెట్టినప్పుడు, ఖచ్చితంగా ఆగి వారి మాట వినాల్సిన అవసరం ఉంటుంది. నటుడిగా తాను కేవలం ఒక కథను, అందులోని పాత్రను మాత్రమే చూస్తానని, ఈ చిత్రంలో ఒక వ్యక్తిలోని లోపాలు మరియు అతని ఆత్మపరిశీలన ప్రయాణాన్ని మాత్రమే ప్రతిబింబించామని మనోజ్ వివరించారు. ఇది ఏ వర్గానికి లేదా కులానికి వ్యతిరేకంగా చేసిన సినిమా కాదని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు నీరజ్ పాండే ఎంతో బాధ్యతగా సినిమాలను రూపొందిస్తాడు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రచార చిత్రాలను తొలగించడం ద్వారా, తాము ఈ సమస్యను ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో అర్థం చేసుకోవచ్చని మనోజ్ బాజ్‌పాయీ పేర్కొన్నారు.
I respect the emotions and concerns people have shared, and I take them seriously. When something you are part of causes hurt to some people, it makes you pause and listen.
As an actor, I come to a film through the character and the story I am playing. For me, this was about… https://t.co/IGlQtLQeNs
— manoj bajpayee (@BajpayeeManoj) February 6, 2026