ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీఎమ్మార్ బియ్యాన్ని తీసుకుంటామని ఒక పక్క చెబుతూనే మరో పక్క కొత్త గన్నీ బ్యాగుల పేరుతో తిరకాసు పెడుతున్నది. గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశమున్నది. వచ్చిన దిగుబడిని మిల్లులకు కేటాయిస్తే ధాన్యం ఉంచడానికి స్థలం కొరత ఏర్పడుతుంది. సీఎమ్మార్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవడానికి తిరకాసు పెడుతుండటంతో వనపర్తి జిల్లాలో దాదాపు 88వేల టన్నుల యాసంగి బియ్యం మిల్లుల్లోనే ఉన్నది. ప్రస్తుత సీజన్లో మళ్లీ ధాన్యం కేటాయిస్తే నిల్వ చేయడానికి స్థలం ఇబ్బంది ఉండడంతో మిల్లర్లు ఆసక్తి కనబర్చడం లేదు. మిల్లు సామర్థ్యానికి మించి పౌరసరఫరాలశాఖ కేటాయింపులు జరుపుతున్నట్లు మిల్లర్లు వాపోతున్నారు.
వనపర్తి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ధాన్యం సేకరణ మొదలైన నేపథ్యంలో మిల్లర్లకు కష్టాలు మొదలయ్యాయి. బకాయిపడ్డ బియ్యాన్ని అ ప్పచెప్పేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటి కీ.. బియ్యం తీసుకోకుండా కేంద్రం తిరకాసు పెడుతున్నది. అయితే, బకాయి బియ్యం అందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కేటాయించే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తెలియక మిల్లర్లు అయోమయానికి గురవుతున్నారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) తీసుకుంటామని ఒక పక్క చె బుతూనే.. మరోపక్క ఫుడ్ కార్పొరేష న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఇబ్బందు లు పెడుతున్నది.
కొత్త గన్నీ బ్యాగుల పేరుతో మోసం చేయాలని చూస్తున్నది. సిద్ధంగా ఉన్న సీఎంఆర్‌ను తీ సుకునేందుకు ఎఫ్‌సీఐ అధికారులకు మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని వాపోతున్నా రు. వానకాలం, యాసంగికి సంబంధించిన సీఎంఆర్ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఒత్తిడి తేవడంతో వానకాలం సీఎంఆర్‌ను మిల్లర్లు అందజేశా రు. అయితే, కేవలం యాసంగికి సంబంధించి దాదాపు 88 వేల టన్నుల సీఎంఆర్‌ను మిల్లర్లు బకాయిపడ్డారు. ఇందులో 50 శాతం బియ్యం మిల్లుల్లోనే ఉన్నాయి. దానిని ఎఫ్‌సీఐకి అప్పజెప్పేందుకు వెళ్లిన మిల్లర్లకు చేదు అనుభవం ఎదురవుతున్నది. ఈ నెలాఖరు వరకు మాత్రమే యాసంగి సీఎంఆర్ గడువు ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని మిల్లర్లు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ ఎఫ్‌సీఐ సహకరించడం లేదు.
ఎఫ్‌సీఐ ఆంక్షలతో మిల్లర్లు తలపట్టుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో 10 బాయిల్డ్ మిల్లులు, 110 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటికి మాత్రమే ధాన్యాన్ని కేటాయించాలి. అయితే, నీటి వనరులు పెరగడంతో గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి ధాన్యం దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశమున్నది. పండిన పంటను మిల్లులకు కే టాయిస్తే.. ధాన్యం ఉంచేందుకు స్థలం కొరత ఏర్పడనున్నది. గతేడాది పండిన 2.44 లక్షల టన్నుల ధా న్యం కేటాయిస్తేనే.. స్థలం సరిపోక పాఠశాలలు, రైతువేదికల్లో భద్రపరిచారు. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో మిల్లు సామర్థ్యానికి మించి పౌరసరఫరాలశాఖ కేటాయింపులు జరుపుతున్నది.
ఇది సీఎంఆర్ ఇచ్చేనాటికి భారంగా మారుతున్నదని మిల్లర్లు వాపోతున్నారు. యాసంగికి సంబంధించి 88 వేల టన్నుల బియ్యం మిల్లుల్లోనే ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్తగా కేటాయించిన బియ్యాన్ని ఎక్కడ ఉంచాలనేది మిల్లర్లకు పాలుపోవడంలేదు. ఎఫ్‌సీఐ నిర్ణయించిన ప్రకారం క్వింటాకు 68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండ గా, కేటాయింపుల వ్యవహారం పౌరసరఫరాలశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక పక్క వంద శా తం సీఎంఆర్ సేకరించాలనే ఒత్తిడి.., మరోపక్క ఎఫ్‌సీఐ తిరకాసులతో మిల్లర్ల ఇబ్బందులను తొలగించలేక నలిగిపోతున్నారు. సీఎంఆర్ టార్గెట్ రీచ్ కావడంతోపాటు ధాన్యాన్ని మిల్లులకు కేటాయించాలి. ధాన్యం కొ నకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు.
అన్ని శాఖలను సమన్వయం చే సుకుంటూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరిస్తాం. గత సీజన్లో 2.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ ఏడాది సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా. ఎఫ్‌సీఐ, మిల్లర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అవసరమైతే వారితో సమావేశమై సమస్యను పరిష్కరిస్తాం.
– వేణుగోపాల్, అదనపు కలెక్టర్, వనపర్తి