నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు. బాలల దినోత్సవ వేడుకలను సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, లయన్స్ క్లబ్, టగ్ ఆఫ్ వార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు దేశభక్తి గీతాలు, ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం, పరుగు పందెం, నృత్య, తాడులాగు పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, పుస్తకాలు అందజేశారు. భారతదేశ తొలి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేశారు. పలు అంగన్వాడీ కేంగ్రాల్లో చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 14